మీరు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేసేందుకు లాస్ట్ డేట్ మిస్సైతే ఇంకా డిసెంబర్ 31 2024 వరకు టైం ఉందని గమనించండి.. ఈ టైంలో మీరు లెట్ ఫీజుతో ఆలస్యంగా ITR ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) అనేది మీ ఆదాయం ఇంకా భారత ఆదాయపు పన్ను శాఖకు వర్తించే పన్ను గురించి వివరాలను ఫైల్ చేయడానికి ఉపయోగించే ఒక ఫామ్. మీకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షలు మించి ఆదాయం ఉంటె మీరు ITR ఫైల్ చేయాలి. పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు మీరు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ల ద్వారా నిర్ణయించిన విధంగా ట్యాక్స్ కట్టాలి.
లెట్ ఫీజుతో ITR ఫైల్ చేయడానికి ఛాన్స్
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం, పన్ను చెల్లింపుదారులు లేట్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు, అయితే దీనికి లెట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. సంవత్సరానికి రూ.5 లక్షల లోపు ఉన్నవారు రూ.1,000 లెట్ ఫీజుతో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. అలాగే సంవత్సరానికి రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారికి లెట్ ఫీజు రూ.5,000గా నిర్ణయించారు. లాస్ట్ డేట్ లోగా మీరు ITరిటర్న్‌ను ఫైల్ చేయకపోతే జరిమానా రూ. 10,000 వరకు పెరుగుతుంది ఇంకా మీరు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

రివైజ్డ్ రిటర్న్ ఆప్షన్
పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31 వరకు ఎన్నిసార్లు అయినా (తప్పులు ఉంటె) ఎడిట్ లేదా మార్పులు చేసిన రిటర్నును ఫైల్ చేయవచ్చు . మంచి విషయం ఏమిటంటే మార్పులు చేసిన రిటర్న్‌లను ఫైల్ చేయడానికి ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ లేదా పెనాల్టీ లేదు.
విదేశీ ఆస్తులు లేదా ఆదాయాన్ని దాచడంపై కఠిన చర్యలు
పన్ను చెల్లింపుదారులు విదేశీ ఆస్తులు లేదా ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు ఇవ్వకపోతే, అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దీనిపై రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ వివరాలు, పన్ను గుర్తింపు నంబర్ (TIN), అకౌంట్ బ్యాలెన్స్‌తో సహా పన్ను చెల్లింపుదారుల విదేశీ ఆస్తులు ఇంకా ఆదాయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉంటుంది.
డిసెంబర్ 31 తర్వాత ఏం జరుగుతుంది?
మీరు డిసెంబర్ 31లోపు ITR ఫైల్ చేయలేకపోతే లెట్ ఫీజు రూ.10,000 వరకు పెరుగుతుంది. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.
లెట్ ఐటిఆర్ ఫైల్ చేసే ప్రాసెస్
*ముందుగా అఫీషియల్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లి, పాన్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
*మీ ఆదాయ వనరుల(income sources) ఆధారంగా సరైన ITR ఫామ్ సెలక్ట్ చేసుకోవాలి.
*ఇప్పుడు FY 2023-24 అండ్ అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసుకోండి.
*మీ ఆదాయపు పన్ను మినహాయింపు ఇంకా ట్యాక్స్ లయబిలిటీ బాధ్యత గురించి సరైన సమాచారాన్ని ఎంటర్ చేయండి.
*ఇక్కడ పెనాల్టీలతో సహా పెండింగ్ ట్యాక్స్ చెల్లించండి.
*ఆధార్ OTP లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రిటర్న్ వెరిఫై చేయండి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications