ITR గడువు పొడిగిస్తారని ఆశ పడుతున్నారా? ఈసారి సీన్ రివర్స్ కావచ్చు!

చాలా మంది టాక్స్ పేయర్లకు ఒక అలవాటు ఉంటుంది. ITR (ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్) ఫైల్ చేయడానికి చివరి తేదీ వరకు ఎదురుచూడటం, ఎలాగూ ప్రభుత్వం ప్రతి ఏటా గడువు పెంచుతుంది కదా అని బద్ధకించడం సర్వసాధారణం అయిపోయింది. మరి ఈ 2026 సంవత్సరంలో కూడా అలాగే డేట్ పొడిగిస్తారా?

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి ఆ ఆశలు ఫలించేలా లేవు. చివరి నిమిషంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి రిలీఫ్ దొరకకపోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గడువు పొడిగింపు ప్రకటన కోసం ఎదురుచూడకుండా, ముందే ఫైలింగ్ పూర్తి చేసుకోవడం మంచిది. ఈ ఏడాది డెడ్‌లైన్ ఎందుకు పెంచకపోవచ్చో ఆ ఆసక్తికర కారణాలు ఇప్పుడు చూద్దాం.

ITR Deadline Extension 2026 Expectation Reality Income Tax Return Filing

1. ఫైలింగ్ సిస్టమ్ అప్పుడే సూపర్ ఫాస్ట్!

గతంలో ఐటీ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు రావడం వల్ల గడువు పెంచాల్సి వచ్చేది. కానీ ఈసారి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ-ఫైలింగ్ ప్లాట్‌ఫారమ్‌ను చాలా ముందుగానే, ఎటువంటి అడ్డంకులు లేకుండా సిద్ధం చేసింది. వెబ్‌సైట్ ఎక్కడా ఆగకుండా చాలా స్మూత్‌గా రన్ అవుతోంది. అందువల్ల టెక్నికల్ సమస్యల పేరుతో గడువు పెంచే అవకాశం కనిపించడం లేదు.

2. ఐటీఆర్ ఫారాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి

సాధారణంగా ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు ఎక్కువగా ఉపయోగించే ITR-1, ITR-2, ITR-3 , ITR-4 ఫారాల సాఫ్ట్‌వేర్ యూటిలిటీలను ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసింది. గతంలో ఈ ఫారాలు ఆలస్యంగా రావడం వల్ల అదనపు సమయం ఇచ్చేవారు. కానీ ఈసారి అందరికీ కావాల్సిన ఫారాలు ముందే అందుబాటులో ఉన్నాయి కాబట్టి, లేట్ చేయడానికి రీజన్ లేదు.

3. ఇప్పటికే కొంతమందికి అదనపు సమయం ఇచ్చారు

ఆడిటింగ్ అవసరం లేని కొందరు ప్రొఫెషనల్స్, పార్టనర్‌షిప్ ఫర్మ్స్ వంటి మరికొన్ని కేటగిరీల టాక్స్ పేయర్లకు ఇప్పటికే గడువును 31 ఆగస్టు 2026 వరకు పొడిగించారు. అంటే అవసరమైన వాళ్లకు ప్రభుత్వం ముందే వెసులుబాటు కల్పించింది కాబట్టి, మళ్లీ అందరి కోసం జనరల్ గడువును పెంచే ఆలోచన ఐటీ శాఖకు లేనట్లే కనిపిస్తోంది.

ట్యాక్స్ నిబంధనల్లో స్థిరత్వం

గడిచిన కొన్ని సంవత్సరాల్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ , ఇతర నిబంధనలలో చాలా మార్పులు వచ్చాయి. దీనివల్ల టాక్స్ పేయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు (CAs) తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కానీ ఈ సంవత్సరం పన్ను నిబంధనలు చాలా స్థిరంగా ఉన్నాయి. ఎలాంటి కొత్త మార్పులు లేదా గందరగోళాలు లేకపోవడంతో, ఫైలింగ్ ప్రాసెస్ చాలా తేలికగా మారిపోయింది.

ఆలస్యం చేస్తే నష్టాలు ఏంటి?

ఒకవేళ మీరు చివరి తేదీ వరకు ఆగి, అప్పుడు కూడా గడువు పెంచకపోతే భారీగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అంతేకాదు చివరి రోజుల్లో సర్వర్లపై లోడ్ పెరిగి వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవచ్చు. డాక్యుమెంట్లు వెతుక్కోవడంలో తప్పులు జరిగే ప్రమాదం ఉంది.

ముఖ్య గమనిక: ప్రభుత్వాలు సాధారణంగా ఏదైనా బలమైన, జెన్యూన్ రీజన్ ఉంటేనే గడువు పెంచుతాయి. ఊరికే పొడిగింపును ఆశించి మీ ఆర్థిక క్రమశిక్షణను పాడుచేసుకోవద్దు.
సింపుల్‌గా చెప్పాలంటే.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా ITR గడువు పెరుగుతుందని అస్సలు అనుకోవద్దు. 2026 పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అన్నీ సవ్యంగా సాగుతున్న వేళ, ప్రభుత్వం నుంచి ఎలాంటి మినహాయింపులు ఆశించకుండా.. వీలైనంత త్వరగా మీ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకొని ప్రశాంతంగా ఉండటమే తెలివైన పని!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+