ITI: 20 శాతం సర్క్యూట్ టచ్ చేసిన ప్రభుత్వ రంగ సంస్థ.. 52 వారాల గరిష్ఠానికి పరుగులు.. ఇదీ సంగతి!
ITI: కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ప్రభుత్వరంగ సంస్థ అనగానే ఠక్కున గుర్తొచ్చేంది హైదరాబాద్ లోని ECIL. అంతగా సేవలందించిన సంస్థ పేరుప్రతిష్ఠలు క్రమేపీ కనుమరుగయ్యాయి. ఆ తర్వాత అదేస్థాయిలో మరో ఉత్పత్తిని రిలీజ్ చేసిన ప్రభుత్వరంగ కంపెనీ బహుశా లేదేమో! కొత్తగా ఓ కంపెనీ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. రావడమే కాదు సంస్థ షేర్ల విలువ ఏకంగా నిన్న 20 శాతం లాభపడి 52 వారాల గరిష్ఠానికి చేరింది.
పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల దిగుమతులపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే సమయంలో దేశీయ అవసరాలను తీర్చేందుకు ఓ ప్రభుత్వ రంగ సంస్థ సిద్ధమైంది. ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ కొలాబరేషన్ తో ల్యాప్ టాప్ మరియు మైక్రో పర్సనల్ కంప్యూటర్ ను అభివృద్ధి చేసింది.

SMAASH అనే బ్రాండ్ తో దీన్ని రూపొందించినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్(ITI) కంపెనీ తెలిపింది. ఇప్పటికే 12 వేలకు పైగా పీసీలు విజయవంతంగా డెలివరీ చేసినట్లు చెప్పింది. ఇటీవలే కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ నుంచి 2 టెండర్లు గెలుచుకుని.. ప్రభుత్వ పాఠశాలలకు 9 వేల ల్యాప్ టాప్‌లను కూడా సరఫరా చేసింది. ఈ మేరకు రెగ్యులేటరీ పైలింగ్ లో ప్రకటించింది.
"మేము స్వంత బ్రాండెడ్ ల్యాప్‌టాప్ మరియు మినీ పిసిని అభివృద్ధి చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రతిభావంతులైన మా పాలక్కాడ్ టీమ్ ఈ ఫీట్‌ను సుసాధ్యం చేసేందుకు కృషి చేసింది. మా ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. కట్ థ్రోట్ మార్కెట్‌లలో టెండర్లు గెలుచుకోవడంలో మాకు సహాయపడుతున్నాయి" అని ITI ఛైర్మన్ మరియు MD రాజేష్ రాయ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications