ITC Q3 Results: దేశంలో పురాతన కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఐటీసీ తాజాగా తన క్యూ3 త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ డిసెంబర్ తో ముగిసిన మూడు నెలలకు రూ.5,572 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.5,301 కోట్లుగా ఉంది. వాస్తవానికి బ్రోకరేజ్ పోల్ ప్రకారం ఆరు సంస్థలు ఐటీసీ నికర లాభం రూ.5,183 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశాయి. మార్కెట్ అంచనాల కంటే మెరుగైన లాభాలను కంపెనీ నమోదు చేయగా.. ఈ కాలంలో కంపెనీ వ్యాపార ఆదాయం రూ.17,651.85గా ఉన్నట్లు వెల్లడైంది.

ఇక రంగాల వారీగా కంపెనీ పనితీరును పరిశీలిస్తే.. ఎఫ్ఎంసీజీ విక్రయాలు మందకొడిగా ఉన్నప్పటికీ ఆదాయం ఏడాది పాత్రిపదికన 7.6 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వెల్లడించిది. ఈ కేటగిరీ కింద కంపెనీ స్టేపుల్స్, డైరీ, పానీయాలు, సువాసనలు, పర్సనల్ వాష్, హోమ్‌కేర్, అగర్బత్తీలు, నోట్‌బుక్‌లతో సహా మరికొన్ని ఉత్పత్తులను విక్రయిస్తోంది. అలాగే సిగరెట్ల వ్యాపారంలో స్థిరమైన వృద్ధి ఊపందుకోవటంతో రాబడి ఏడాది ప్రాతిపదికన 2.3 శాతం పెరిగింది.
ఇక ఐటీసీ తన హోటల్స్ వ్యాపారంలో రాబడులను 18 శాతం మేర పెంచుకుంది. కరోనా తర్వాత దేశీయంగా ప్రయాణాలు, టూరిజం వంటివి తిరిగి ఊపందుకోవటంతో హాస్పిటాలిటీ వ్యాపారం మంచి రాబడులను ఐటీసీకి అందిస్తోంది. అయితే కంపెనీ అగ్రి వ్యాపార విభాగం మాత్రం కొంత సవాళ్లను ఎదుర్కొంటోందని నిపుణులు చెబుతున్నారు. బియ్యం, గోధుమలను మినహాయిస్తే ఆదాయం 14.2 శాతం వృద్ది చెందింది. ఈ వ్యాపారంలో కంపెనీ దేశవ్యాప్తంగా 4.5 లక్షల రైతులతో కలిసి పనిచేస్తూ 23 లక్షల ఎకరాలకు విస్తరించింది.
చివరిగీ కంపెనీ పేపర్ అండ్ ప్యాకేజింగ్ వ్యాపారంలో పండుగ సీజన్ తర్వాత డిమాండ్ నెమ్మదించిందని వెల్లడైంది. అలాగే చైనా నుంచి తక్కువ రేటుకు వస్తున్న ఉత్పత్తులు కంపెనీ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నాయని వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ తన షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.6.25 ఇంటెరిమ్ డివిడెండ్ అందిస్తున్నట్లు ప్రకటించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications