ITC: ఐటీసీ భారీ ప్లాన్.. రిలయన్స్ తో కలిసి కొత్త ప్రొడక్ట్ లాంచ్..!
దేశంలోని శీతలపానీయాల మార్కెట్ లో దశాబ్దాలుగా కోకా-కోలా, పెప్సికో లో హవా నడుస్తోంది. అయితే వీటికి పోటీ ఇవ్వడానికి కొన్ని కంపెనీలు వచ్చినా.. సక్సెస్ కాలేకపోయాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత రిలయన్స్ కాంపా కోలా బ్రాండ్ కొనుగోలు చేసింది. ఇప్పుడు అగ్రేసివ్ గా మార్కెటింగ్ చేస్తోంది. తాజాగా ఐటీసీ కూడా రిలయన్స్ తో కలిసి కోలా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రీమియం షుగర్-ఫ్రీ కొబ్బరి కోలాతో కార్బోనేటెడ్ పానీయాల రంగంలోకి ఐటీసీ ప్రవేశించింది.ఐటీసీ 'బి నాచురల్' పానీయాల పోర్ట్‌ఫోలియో ప్రారంభించింది.
ఈ కొబ్బరి కోలా పానీయం 250-ఎంఎల్ ధర రూ. 60 గా ఉంది. దీన్ని లేత కొబ్బరి నీటితో తయారు చేస్తారు. మార్కెట్లో దొరికే డైట్ కోక్ లేదా పెప్సీ బ్లాక్ (300ml) ధర రూ.40 మాత్రమే ఉంది. ఐటీసీ మాత్రం కాస్త ఎక్కువ ధరతో ప్రీమియం కస్టమర్లను టార్గెట్ చేస్తోంది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డైట్ కోలా విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఐటీసీ ముందుకెళ్తోంది. కంపెనీ దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల కొబ్బరి కోలా పానీయాన్ని విక్రయించనుంది.

ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో డైట్ కోక్ తాగేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే షుగర్ ఫ్రీ పానీయాల అమ్మకాలు పెరిగాయి. పెప్సీ బాట్లింగ్ కంపెనీ అయిన వరూణ్ బెవరేజెస్ అమ్మకాల్లో ఏకంగా 63% వాటా ఇలాంటి తక్కువ చక్కెర ఉన్న పానీయాలదే కావడం విశేషం. ఐటీసీ కూడా భవిష్యత్తులో మరిన్ని కొత్త ఫ్లేవర్లు, సైజుల్లో డ్రింక్స్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త పానీయంలో కోలాను లేత కొబ్బరి నీటితో కలిపి, చక్కెర రహిత ఉత్పత్తిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మార్కెట్‌లోని ప్రీమియం విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కొత్త ఫ్లేవర్లు, వేరియంట్లు, ప్యాక్ సైజుల ద్వారా తమ పానీయాల వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉంటామని ఐటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి తెలిపారు. ఇటీవలి కాలంలో శీతల పానీయాల మార్కెట్‌లో అతిపెద్ద మార్పుకు కారణం రిలయన్స్ సంస్థ 'కాంపా'ను పునరుద్ధరించడమే. 200 మిల్లీలీటర్ల బాటిల్‌ను రూ.10 ధరకే అందిస్తోంది. దీంతో ఇప్పుడు కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దేశీయ బ్రాండ్లు కూడా బహుళజాతి సంస్థలకు పెద్ద ఎత్తున సవాలు విసరగలవని రిలయన్స్ విజయం నిరూపించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో క్యాంపా స్థూల అమ్మకాలు రూ.4,700 కోట్లను దాటాయి.


Click it and Unblock the Notifications