ITC షేర్ హోల్డర్లకు జాక్ పాట్.. కొత్త ఏడాది హోటల్ బిజినెస్ విభజన..!!

ITC Shares: భారతదేశంలోని అత్యంత పురాతన కంపెనీల్లో ఐటీసీ గ్రూప్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలోని ఎఫ్ఎంసీజీ రంగంలో కీలక ఆటగాళ్లలో ఒకటిగా ఉంది. అలాగే కంపెనీ పొగాకు ఉత్పత్తులతో పాటు హాస్పిటాలిటీ రంగం, పేపర్ బిజినెస్ వంటి ఇతర వ్యాపారాలకు సైతం విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ ఐటీ తన హోటల్స్ వ్యాపారాన్ని గ్రూప్ నుంచి విడదీయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జనవరి 1, 2025 నుంచి ఈ వ్యాపారాన్ని ప్రత్యేక విభాగంగా విడదీయనుందని వెల్లడించింది. దీంతో హోటల్స్ వ్యాపారం ప్రత్యేక లిస్టెడ్ కంపెనీగా మార్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన షేర్ల కేటాయింపుల కోసం జనవరి 6, 2025ను రికార్డు తేదీగా కంపెనీ నిర్ణయించింది. వాస్తవానికి కంపెనీ తన హోటల్స్ వ్యాపారాన్ని స్ప్లిట్ చేయాలని ఆగస్టు 2023లో కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ITC Group demerging hotels business from jan 1st 2025 Good time for share holders to gain

ముందుగా నిర్ణయించిన ప్లాన్ ప్రకారం హోటల్స్‌ వ్యాపారంలో ఐటీసీ 40% వాటాను కలిగి ఉండనుంది. మిగిలిన 60% షేర్లు కంపెనీ తన ప్రస్తుత షేర్ హోల్డర్లకు అందించాలని నిర్ణయించింది. అయితే ఇది వారి ప్రస్తుత షేర్ హోల్డింగ్ ఆధారంగా జరగనుందని తెలుస్తోంది. ఐటీసీలో ప్రతి 10 షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులకు కంపెనీ ఐటీసీ హోటల్స్ వ్యాపారంలో 1 షేరును అందించాలని నిర్ణయించింది. ఎవరైనా ఇన్వెస్టర్ దీని కింద ఐటీసీ హోటల్స్ సెపరేషన్ ప్రయోజనాన్ని పొందటానికి వారు జనవరి 3, 2025లోపు తమ డీమ్యాట్ ఖాతాలలో కలిగి ఉండటం కోసం కొనుగోలుకు ఉన్న చివరి అవకాశం. అయితే ఈ తేదీ తర్వాత కొనుగోలు చేసే షేర్లు ITC హోటల్స్ లాభాలలో చేర్చబడవని గుర్తుంచుకోవాలి.

వ్యాపార విభజన తర్వాత ఐటీసీ హోటల్‌లు ప్రత్యేక సంస్థగా పనిచేయనుందని తెలుస్తోంది. నేడు ఇంట్రాడేలో ఉదయం 11.12 గంటల సమయంలో ఐటీసీ కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.478.95 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5.99 లక్షల కోట్లుగా ఉంది. అలాగే కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.528.50గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.399.35గా ఉంది. దేశంలో లగ్జరీ హోటల్స్ వ్యాపారంలో ఉన్న కంపెనీ దాదాపు 140 హోటల్స్ నిర్వహిస్తోంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+