రోమ్: తన పొరుగుదేశం ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాపై ఆంక్షలు, నిషేధాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆరంభించిన మరుక్షణం నుంచే ఆరంభమైన ఆంక్షలు- ఇప్పటికీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాలను విధించాయి. ఆ దేశ విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని కూడా మూసివేశాయి. ఆర్థిక పరమైన ఆంక్షలను విధించాయి. దిగుమతులను నిషేధించాయి.
అయినప్పటికీ- రష్యా ఏ మాత్రం భయపడట్లేదు. ఈ ఆంక్షలకు లొంగట్లేదు. సరికదా- తన యుద్ధాన్ని మరింత ముమ్మరం చేసింది. దాడులను తీవ్రతరం చేసింది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు నగరాలు రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లాయి.. అణు విద్యుత్ కేంద్రం సహా. ప్రత్యేకించి తూర్పు ప్రాంతంలోని నగరాలపై రష్యా సైనిక బలగాలు పట్టు బిగించాయి. రష్యా సైన్యం దాడులను ఉక్రెయిన్ తిప్పి కొడుతోంది. రాజధానిని కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది.

ఈ పరిణామాల మధ్య- రష్యాపై ఆంక్షలను విధించిన జాబితాలో తాజాగా ఇటలీ కూడా చేరింది. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం ఉన్న ఇటలీ- ఇప్పటిదాకా రష్యాపై ఆంక్షలను అమలు చేయలేదు. ఇప్పుడు తాజాగా ఆ దిశగా ఉత్తర్వులను జారీ చేసింది. రష్యన్ ఒలిగార్స్‌కు చెందిన అకౌంట్లన్నింటినీ ఫ్రీజ్ చేయాలంటూ అన్ని బ్యాంకులకూ ఆదేశాలు వెళ్లాయి. బ్యాంక్ ఆఫ్ ఇటలీ- ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
సాధ్యమైనంత త్వరగా వారి బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయాలంటూ ఆదేశించింది. ఇటాలియన్ ట్రెజరీ విభాగం ఫైనాన్షియల్ సెక్యూరిటీ కమిటీ సమావేశమైన అనంతరం బ్యాంక్ ఆఫ్ ఇటలీ ఈ మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రష్యాకు చెందిన ఒలిగార్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున యూరోపియన్ యూనియన్ దేశాల్లో కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆరంభించిన తరువాత- అవన్నీ స్తంభించిపోయాయి.


Click it and Unblock the Notifications