Maa Inti Bangaram: రూ.100 కోట్లు వసూలు చేసిన మా ఇంటి బంగారం..
టాలీవుడ్ సంక్రాంతి తర్వాత భారీ హిట్ మూవీస్ రాలేదు. జూన్ పెద్ది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన మా ఇంటి బంగారం సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమంత నటించిన ఈ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. సమంత కీలక పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి నుంచి మంచి పబ్లిక్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఈ సినిమా వసూళ్ల రికార్డు సృష్టించింది. తాజాగా మాటి బంగారం మూవీ కలెక్షన్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. హీరోయిన్ ఓరియెంట్ గా వచ్చినా.. రూ.100 కోట్లు వసూలు చేయడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా సమంతకు మూవీ యూనిట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో సినిమా విడుదల కు ముందు జరిగిన ఓ విషయం గురించి ఆమె ప్రస్తావించారు. ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా అని ఆలోచించినట్లు చెప్పారు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని అదరిస్తారా అని డౌట్ వచ్చిందని అన్నారు. మా ఇంటి బంగారం సినిమాకు ముందు తన ఫ్రెండ్ ఎగ్జిబిటర్ కు ఫోన్ చేసినట్లు చెప్పారు. మా ఇంటి బంగారం గురించి ఏమనుకుంటున్నారు, ఎంత వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారని అడిగారు.

హీరోయిన్ సినిమా ఎవరైనా ఎందుకు చూస్తారు. ఆమె పెద్ద హీరో సినిమాలో నటిస్తే ఫర్వాలేదని చెప్పాడు. ఈ సినిమాకు ముందు చాలా మందిలో ఉన్న అభిప్రాయమిదని చెప్పారు. ఎవరైనా తెగించి ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడినప్పుడే నిజమైన మార్పు వస్తుందని తాను అనుకుంటున్నట్లు వివరించారు. ఒక గొప్ప మార్పునకు నాంది అవుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఎవరైనా ఎగ్జిబిటర్‌కు ఫోన్ చేసి, మహిళా ప్రాధాన్యమున్న చిత్రం గురించి అడిగితే, సమాధానం వెంటనే ప్రతికూలంగా అని రాకూడదని తాను ఆశిస్తున్నానట్లు చెప్పారు.
సమంత మూవీ రూ.100 కోట్లు రాబట్టడంపై సినీ తారలు సంతోషం వ్యక్తం చేశారు. కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు, దియా మీర్జా, సిరి హన్మంతు, నవదీప్ సహా పలువురు అభిమానులు సమంతకు శుభాకాంక్షలు చెప్పారు. గతంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అంటే విజయశాంతి మూవీస్ ఉండేవి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి.


Click it and Unblock the Notifications