అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 26 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించాక ఈ ప్రభావం నేడు భారత మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 9:17 గంటలకు సెన్సెక్స్ 564 పాయింట్లు అంటే 0.74% తగ్గి 76,053 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 138 పాయింట్లు అంటే 0.59% తగ్గి 23,193 వద్ద ఉంది. ఉదయం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా 26 పైసలు బలహీనపడింది. ఈ సుంకాల నుండి మందుల కంపెనీలు మినహాయింపు పొందగా, మందుల కంపెనీల షేర్లు మాత్రం పెరుగుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 5 శాతం పెరిగింది. గ్లాన్ ఫార్మా షేర్లు 15% పెరగగా, లుపిన్ షేర్లు 6% లాభంతో ట్రేడవుతున్నాయి. గ్లాన్ ఫార్మా ఆదాయంలో 50% అమెరికా నుండే వస్తుంది.

ఇవాళ గురువారం టెక్ మహీంద్రా, టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) హెవీవెయిట్‌ల షేర్లు భారీగా అమ్ముడయ్యాయి. భారీ సుంకాలు ప్రపంచ ఆర్థిక వృద్ధికి తీవ్రంగా ఆటంకం కలిగిస్తాయనే ఆందోళనల మధ్య నాస్డాక్-100, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అండ్ ఎస్&పి 500 వంటి యుఎస్ ఫ్యూచర్స్ 4.5% వరకు పడిపోయిన తరువాత సెంటిమెంట్ మరింత దెబ్బతింది. కార్పొరేట్ లాభాలను దెబ్బతీస్తుందనే ఆందోళనల మధ్య ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ప్రస్తుత వాణిజ్య సంఘర్షణను తీవ్రతరం చేస్తుందనే భయాలతో ఈ పరిస్థితి నెలకొంది.
ఉదయం 11:25 గంటలకు, బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీ 0.35% క్షీణించాయి, దీనికి కారణం ఐటి రంగంలో అమ్మకాలు, బిఎస్ఇ ఐటి ఇండెక్స్ 3.6% వరకు పడిపోగా, బ్లూచిప్ ఐటి స్టాక్స్ టిసిఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ 3-4% మధ్య పడిపోయాయి. దేశంలో అత్యంత విలువైన ఐటీ స్టాక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 3.6% వరకు క్షీణించగా, రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ఇప్పటివరకు ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో 3.3% వరకు పడిపోయింది. ఇక టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్, విప్రో, ఎల్‌టిఐమైండ్‌ట్రీ షేర్లు 3% వరకు తగ్గాయి.
మరోవైపు సెన్సెక్స్ స్టాక్స్‌లో టెక్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా నష్టపోయాయి. ఈ కంపెనీల షేర్లు 2.5 శాతం తగ్గగా, మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మారుతి, టాటా మోటార్స్ షేర్లు కూడా క్షీణతతో మొదలయ్యాయి. సెక్టార్ల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.5% పడిపోయింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, ఎంఫసిస్ షేర్లు తగ్గడం ఇందుకు కారణం. అమెరికాలో మాంద్యం ముప్పు పెరిగేకొద్దీ ఐటీ కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని బెర్న్‌స్టెయిన్ అభిప్రాయపడ్డారు.
విదేశీ మార్కెట్ల పరిస్థితి చూస్తే : అమెరికాకి సన్నిహిత మిత్రదేశమైన జపాన్‌పై 24 శాతం సుంకం విధించింది. దీని ప్రభావం జపాన్ స్టాక్ మార్కెట్లలో పెద్దగా కనిపిస్తోంది. నిక్కీ 4 శాతానికి పైగా పడిపోయి 8 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. బ్యాంకుల పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. బ్యాంక్ ఇండెక్స్ 6.4% పడిపోయింది. అంతేకాకుండా, కార్ కంపెనీల షేర్లు కూడా క్షీణించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్ షేర్లు 4.7 శాతం పడిపోయాయి. అదేవిధంగా, చిప్ తయారీ కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. టోక్యో ఎలక్ట్రాన్ 5.8%, అడ్వాంటెస్ట్ 4.9% పడిపోయాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications