Closing Bell: ఉదయం నష్టాల ప్రారంభం నుంచి కొద్దిసేపటికి తేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఒత్తిడికి చిత్తయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయంలో కీలక సూచీలు స్వల్ప నష్టాలతో ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో ఓలటాలికీ కారణంగా బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 111 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ స్వల్పంగా 9 పాయింట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 33 పాయింట్లను కోల్పోయింది. అయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం మెరుగైన పనితీరుతో ఇన్వెస్టర్లకు భారీగా ఊరటను అందించాయి. చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ నేడు 567 పాయింట్ల భారీ లాభంలో తన ప్రయాణాన్ని ముగించింది.

మార్కెట్లు ముగింపు నాటికి మెటల్, రియల్టీ, ఆటో రంగాలకు చెందిన కంపెనీల షేర్లు ర్యాలీతో మంచి పనితీరును కనబరిచాయి. బీఎస్ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు 1 శాతం మేర పెరుగుదలను నమోదు చేశాయి. ఎన్ఎస్ఈలో టాటా కన్జూమర్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, నెస్లే, శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, ఎల్ టి, టీసీఎస్, విప్రో, ఐషర్ మోటార్స్, ఎయిర్ టెల్, సిప్లా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, సన్ ఫార్మా, మారుతీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications