కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020లో ఐటీ కంపెనీలు చేసే వ్యయాలు 8.1 శాతం తగ్గి 83.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.6.26 లక్షల కోట్లు) పరిమితం అయ్యే అవకాశం ఉందని రీసెర్చ్ ఫర్మ్ గార్ట్‌నర్ నివేదిక తెలిపింది. గత అయిదేళ్లలో ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం ఇదే మొదటిసారి అని ఈ నివేదిక తెలిపింది. గతంలో పలుమార్లు ఐటీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వ్యయాలు ఈసారి వ్యయాలు తగ్గించుకోవడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిన విషయం తెలిసిందే.

మారిన ఐటీ బడ్జెట్ ప్రాధాన్యతలు
2019 నవంబర్‌లో గార్డ్‌నర్ వెల్లడించిన అంచనా ప్రకారం 2020లో ఐటీ వ్యయాలు 6.6 శాతం వృద్ధితో 94 బిలియన్ డాలర్లకు చేరుతాయని పేర్కొంది. ఇండియాలోని ఆయా సంస్థల సీఎఫ్ఓలు, సీఐవోలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఐటీ బడ్జెట్ ప్రాధాన్యతల్ని కంపెనీలు మార్చుకుంటున్నాయని తెలిసిందని గార్ట్‌నర్ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారు తమ బడ్జెట్ వ్యాయల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు గార్ట్‌నగర్ రీసెర్చ్ డైరెక్టర్ నవీన్ మిశ్రా తెలిపారు.

పెరగనున్న క్లౌడ్ సేవలు
కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం వంటి ప్రభుత్వ మార్గదర్శకాలకు కట్టుబడుబడుతూ సంస్థలు ముందుకు నడవాలంటే మరింత ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. రిమోట్ వర్కింగ్, శ్రామిక శక్తి సహకారం వంటి వివిధ అంశాలను కంపెనీలు ఎంచుకున్నాయని పేర్కొంది. ఇది పనితీరును మార్చివేయడంతో పాటు వ్యయాలు పెంచుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత వంటి టెక్నాలజీ పరిజ్ఞానం వైపు ఖర్చులు పెరుగుతాయి. సంస్థలు డెస్క్ టాప్, మౌలిక సేవలు, వర్చువల్ ప్రయివేటు నెట్ వర్క్, భద్రత వంటి సాంకేతిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో దేశంలో క్లౌడ్ సేవలు పెరుగుతాయని వెల్లడించింది.

కొనుగోళ్లు ఆలస్యం
దేశంలో డివైస్‌లు, డేటా సెంటర్ సిస్టం వ్యవస్థలపై వ్యయాలు 2020లో వరుసగా మైనస్ 15.1 శాతం, మైనస్ 13.2 శాతంగా ఉన్నాయని తెలిపింది. సీఐవోలు (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్) ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగనున్నారని, దీంతో కొత్త కొనుగోళ్లు ఆలస్యం కానున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఖర్చులు అన్ని విభాగాలలో పెరగనుందని పేర్కొంది. టెలిహెల్త్, స్మార్ట్ చాట్‌బోట్, మొబైల్ అప్లికేషన్స్, డిస్టెన్స్ లర్నింగ్ ఎడ్యుకేషన్ సాఫ్టువేర్ వంటి ఖర్చులు పెరుగుతాయని పేర్కొంది. దీంతో ఎంటర్‌ప్రైజ్ సాఫ్టువేర్‌పై ఖర్చు (మైనస్ 2.6) తగ్గుతుందని తెలిపింది.

ఆర్థిక మాంద్యం.. ఐటీ వ్యయాలపై జాగ్రత్త
డేటా కేంద్రాల వ్యవస్థలపై 13.2 శాతం వ్యయం క్షీణించి 318.6 కోట్ల డాలర్లకు, పరికరాల వ్యయాలు 15.1 శాతం క్షీణించి 3,107 కోట్ల డాలర్లకు పరిమితం అవుతుందని తెలిపింది. కరోనా వల్ల అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశముందని సీఐవోలు అభిప్రాయపడ్డారు. దీంతో ఐటీ వ్యయాలపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు మిశ్రా తెలిపారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications