గత రెండేళ్లుగా ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి 2026 ఒక కీలకమైన ఏడాది కాబోతోంది. అయితే ఒకప్పుడు కనిపించిన మాస్ హైరింగ్(Mass Hiring).. అంటే వేల సంఖ్యలో ఒకేసారి తీసుకోవడం ఇకపై జరగకపోవచ్చు. ఐటీ పరిశ్రమ ఇప్పుడు 'వాల్యూమ్' (సంఖ్య) నుండి 'వాల్యూ' (విలువ) వైపు మళ్లుతోంది. అంటే.. ఎక్కువ మంది సాధారణ ఉద్యోగులను తీసుకోవడం కంటే తక్కువ మంది అయినా అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను తీసుకోవడానికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

2026 హైరింగ్ ట్రెండ్స్ (Hiring trends)
2021-22 కాలంలో జరిగినట్టుగా భారీ రిక్రూట్ మెంట్స్ గానీ, 2023-24లో ఉన్న స్తబ్దత గానీ 2026లో ఉండవు. 2026లో కంపెనీలు కొత్త వ్యూహాన్ని అనుసరించబోతున్నాయి. కంపెనీలు తమ దగ్గర ప్రాజెక్టులు సిద్ధంగా ఉంటేనే కొత్తవారిని తీసుకుంటాయి. దీనివల్ల గతంలో ఉన్న 'బెంచ్' (Bench) సంస్కృతి క్రమంగా తగ్గిపోతోంది.
డిమాండ్ ఉన్న స్కిల్స్ ఇవే!
సాధారణ అప్లికేషన్ మెయింటెనెన్స్ లేదా మాన్యువల్ టెస్టింగ్ చేసే ఉద్యోగాలకు ఇక గడ్డుకాలమే అని చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్‌లో హైరింగ్ (Hiring).. ఎక్కువగా ఈ క్రింది విభాగాల్లోనే జరుగుతోంది..
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) & GenAI: ఏఐ అప్లికేషన్లను డెవలప్ చేయడం, అమలు చేయడం వంటి పనులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.
- సైబర్ సెక్యూరిటీ: డేటా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత పెరగడంతో ఈ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్ ఉంది.
- క్లౌడ్ ఆప్టిమైజేషన్: క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చులను తగ్గిస్తూ సామర్థ్యాన్ని పెంచే నిపుణులు ఫ్యూచర్ లో బాగా అవసరమవుతారు.
- డేటా ఇంజనీరింగ్: భారీ డేటాను విశ్లేషించి వ్యాపార నిర్ణయాలకు తోడ్పడే వారికి కూడా డిమాండ్ ఉంటుంది.
- ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫారమ్స్: SAP S/4HANA, సేల్స్‌ఫోర్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో నైపుణ్యం ఉన్నవారికి కంపెనీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి.
ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి?
క్యాంపస్ నియామకాలు కరోనాకు ముందున్న స్థాయికి చేరుకోవడం కష్టమే. ఇప్పుడు కంపెనీలు 'డిగ్రీ' కంటే 'సర్టిఫికేషన్, ప్రాక్టికల్ నైపుణ్యం' (Skills) ఉన్న ఫ్రెషర్లకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆటోమేషన్ వల్ల ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు తగ్గిపోవడంతో, అప్‌స్కిల్లింగ్ (కొత్త విద్యను నేర్చుకోవడం) అనేది ఫ్రెషర్లకు తప్పనిసరిగా మారింది.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) జోరు
సాధారణ ఐటీ సర్వీస్ కంపెనీల కంటే.. ప్రస్తుతం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) భారతదేశంలో నియామకాలను వేగవంతం చేస్తున్నాయి. ఇవి కేవలం సర్వీస్ ఇవ్వడమే కాకుండా, కొత్త ఉత్పత్తుల తయారీ (Product Engineering) అలాగే ఐపీ (Intellectual Property) సృష్టిపై దృష్టి పెడుతున్నాయి. దీనివల్ల సీనియర్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులకు జీతాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
జాబ్ సీకర్స్ ఏం చేయాలి?
2026లో హైరింగ్ (Hiring) అనేది పూర్తిగా నైపుణ్యం చుట్టూ తిరుగుతుంది. మేనేజ్మెంట్ రోల్స్ కంటే టెక్నికల్ డెప్త్ ఉన్న లీడర్లకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కంపెనీలు తమ ఐటీ బడ్జెట్‌లను పెంచుతున్నప్పటికీ.. అది కేవలం అత్యాధునిక డిజిటల్ స్కిల్స్ ఉన్నవారి కోసమే ఖర్చు చేస్తున్నాయి. కాబట్టి కాలానికి అనుగుణంగా తమను తాము మలచుకునే వారికే ఐటీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications