Multibagger Share: లక్షను పెట్టుబడిని నాలుగింతలు చేసిన స్టాక్.. మీరూ కొన్నారా..?
Multibagger Share: దేశీయ స్టాక్ మార్కెట్లు గరిష్ఠాల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్న వేళ అనేక మల్టీబ్యాగర్ స్టాక్స్ తమ ఇన్వెస్టర్లకు కాసుల పంట కురిపిస్తున్నాయి. ఇన్నాళ్ల వారి ఎదురుచూపులు మంచి ఫలితాన్ని ఇచ్చాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ గురించే. గడచిన మూడేళ్ల కాలంలో ఈ కంపెనీ షేర్లు తన ఇన్వెస్టర్లకు 300 శాతానికి పైగా రాబడిని అందించాయి. జూన్ 23, 2020లో రూ.248.2 వద్ద ఉన్న కంపెనీ షేర్ ధర తాజాగా రూ.1,015కి చేరుకుంది. ఈ క్రమంలో 310 శాతం రిటర్న్స్ అందించింది. ఇది సెన్సెక్స్ సూచీ మూడేళ్లలో ఇచ్చిన 77.76 శాతం రాబడి కంటే ఎక్కువగా ఉంది.

ఏడాది ప్రాతిపధికన కంపెనీ షేర్లు 2023లో ఇప్పటి వరకు 160 శాతం రాబడిని అందించి రూ.620కిపైగా లాభపడింది. అలాగే ఐదేళ్ల కాలంలో దీర్ఘకాలికంగా పెట్టుబడిని కొనసాగించిన ఇన్వెస్టర్లకు 175 శాతం రాబడిని అందించింది. ఈ క్రమంలో కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధరను పరిశీలిస్తే.. రూ.365గా ఉంది. అలాగే 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.1,260ని తాకింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,720 కోట్లుగా ఉంది. 1986లో స్థాపించబడిన కంపెనీ నోయిడా కేంద్రంగా 1782 మంది ఉద్యోగులతో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
న్యూక్లియస్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ స్టాక్ మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.67.65 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ క్రమంలో నాలుగో త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు రూ.206.2 కోట్లకు పెరిగాయి. ఈ క్రమంలో కంపెనీ బోర్డు ఒక్కో షేరుపై రూ.10 తుది డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలోని కంపెనీలకు తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. సాఫ్ట్ వేర్ సేవల మార్కెటింగ్, రూపకల్పనలో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications