తెలంగాణలో పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అనేక సంస్థలతో చర్చలు జరుపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దావోస్ పర్యటన సందర్భంగా పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా చాలా కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఆసక్తి చూపుతోంది.
బుధవారం తెలంగాణ సెక్రటేరియట్ లో విన్‌ఫాస్ట్ కంపెనీ భారత సీఈవో ఫామ్ సాన్హ చౌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశం అయింది. హైదరాబాద్ లో పెట్టుబడులపై వారు చర్చించారు. ప్రభుత్వ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, అర్బన్ మొబిలిటీలో సొల్యూషన్స్, భవిష్యత్‌లో నగరాల అభివృద్ధి పై మంత్రి వారితో మాట్లాడినట్లు తెలిసింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరల్లో హైదరాబాద్ ఒకటి అని శ్రీధర్ బాబు అన్నారు. వచ్చే 15 ఏళ్లలో తెలంగాణ జనాభాలో సగం జనాభాకు హైదరాబాద్ నిలయంగా మారుతుందని అన్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశ్వసనీయమైన భాగస్వాముల కోసం చూస్తున్నట్లు చెప్పారు.
తాము హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు విన్‌ఫాస్ట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. విన్‌ఫాస్ట్ ఇటీవలే తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సంస్థను రూ.4 వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. తదుపరి విస్తరణలో భాగంగా తెలంగాణపై సంస్థ దృష్టి సారించింది.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications