ఈ రోజుల్లో సామాన్యులు బంగారం కొనేలా కనిపించడం లేదు. తాజాగా పుత్తడి ధర మరోసారి పెరిగింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,810ఉంది. అది గురువారం నాటికి రూ.260 పెరిగి రూ.75,070కు పెరిగింది. ఇక బుధవారం కిలో వెండి ధర రూ. 94,170ఉంది. గురువారం రూ.360 పెరిగి రూ.94,530కు పెరిగింది. ఈక్విటీ మార్కెట్‌లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకుల కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,300 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,420 గా ఉన్నాయి.బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల 24, 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.200, రూ.260 పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.250 పెరిగి రూ.67,850 చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ.74,020 పెరిగింది.

ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 67090 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు రూ. 73190 ఉంది.కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67090, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 73190. ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67240 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 73340 చేరింది.
బెంగళూరులో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 67090 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 73190గా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ఔన్సుకు $2,372.99 వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ $2,378.40 వద్ద స్థిరంగా ఉన్నాయి.
స్పాట్ వెండి ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 30.87 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.5 శాతం పెరిగి 994.10 డాలర్లకు, పల్లాడియం 0.4 శాతం పెరిగి 989.93 డాలర్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications