Gold Price Today: శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..!
గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర గురువారం కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే పసిడి ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 తగ్గి రూ. 6680 గా ఉంది. తులం 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.330 తగ్గి రూ. 72,870 కు చేరింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,000 గా ఉంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర రూ.72,970 గా ఉంది.
ముంబై, బెంగళూరు, చెన్నై కూడా బంగారం ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.300 తగ్గి రూ.66,950లకు చేరింది. తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ.380 తగ్గి రూ.72,870 గా ఉంది. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం ఈరోజు ఎటువంటి మార్పు రాలేదు. వెండి ధర కిలో రూ.92,000 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.67,110గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,210గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.67,110 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.73,210గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,210 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.67,110 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.67,110 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 గా ఉంది.
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న వార్తలతో బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పాట్ బంగారం 0.5% క్షీణించి ఔన్స్‌కి $2,500.55కి చేరుకుంది. రా బంగారం 24 క్యారెట్ల క్వాలిటీతో ఉంటుంది. ఇక బంగారం ఆభరణాలు 22 క్యారెట్ల నాణ్యతతో ఉంటాయి.


Click it and Unblock the Notifications