భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ మొదటి రోజు రూ.100 కోట్లు రాబట్టగలిగిందని తెలుస్తోంది. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ నటించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఓపెనింగ్ డే పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఆదిపురుష్ భారతీయ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలను సృష్టించింది. మొదటి రోజున భారతదేశంలో (అన్ని భాషలలో) రూ. 95-98 కోట్ల నికర వసూళ్లను సాధించింది.
Sacnilk.com ప్రకారం, ఇతిహాసం రామాయణం ఆధారంగా ప్రభాస్ నటించిన మాగ్నమ్ ఓపస్ అన్ని భాషల నుంచి దేశీయ సర్కిల్‌లలో రూ. 95-98 కోట్లు సంపాదించింది. ఈ నివేదిక సినిమా కలెక్షన్ల బ్రేకప్‌ను షేర్ చేసింది. తెలుగు మార్కెట్ నుంచి ఆదిపురుష్ భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత హిందీ వెర్షన్ కూడా వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ నుంచి 58.5 కోట్లు, హిందీ నుంచి 35 కోట్లు వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తమిళం, మలయాళం వెర్షన్లు వరుసగా 0.7, 0.4 కోట్లుగా అంచనా వేశారు.విదేశాలలో దాదాపు రూ. 35 కోట్లు రాబట్టగలదని చెబుతున్నారు.
కలెక్షన్ల పై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా మొదటి వారంలో రూ.150 కోట్ల మార్కును దాటుతుందన్నారు.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన కృతి సనన్ సీత పాత్ర చేయగా.. సైప్ అలీ ఖాన్ రావణుడి పాత్ర వేశారు. జూన్ 11న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన ఈ సినిమా రూ.12 కోట్ల బిజినెస్ చేసింది. జాతీయ థియేటర్ చైన్ PVR హిందీ మార్కెట్‌లోనే లక్షకు పైగా టిక్కెట్‌లను విక్రయించింది. ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల స్పందనను చూసింది, విడుదలకు దాదాపు ఒక వారం ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో దాదాపు $16,000 అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ సాధించింది.


Click it and Unblock the Notifications