ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్టాక్ మార్కెట్ బూమ్ పెంచడానికి, ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు గని, ఆసియాలో అతిపెద్ద జింక్ ఉత్పత్తిదారుతో సహా ప్రభుత్వరంగ సంస్థలలో చిన్న వాటాలను విక్రయించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది.ప్రభుత్వం కోల్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లలో ఆఫర్-ఫర్-సేల్ ద్వారా 5%-10% విక్రయించాలని చూస్తోంది. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
ప్రభుత్వానికి 165 బిలియన్ రూపాయలు
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని లిస్టెడ్ సంస్థతో సహా మొత్తం ఐదు సంస్థలను ఎంపిక చేసుకోవచ్చని వారు తెలిపారు.ప్రస్తుత ధరల ప్రకారం, బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం ఈ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 165 బిలియన్ రూపాయలు ($2 బిలియన్లు) వచ్చే అవకాశం ఉందట.

ప్రైవేటైజషన్ భాగంగా కేంద్రం మార్చి వరకు సంవత్సరానికి 650 బిలియన్ రూపాయలను పొందాలని ప్లాన్ చేసింది. కానీ ఇప్పటి వరకు లక్ష్యంలో కేవలం మూడింట ఒక వంతు లక్ష్యాన్ని సాధించింది.ప్రధానంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియాలో కొంత భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మింది. మేలో $2.7 బిలియన్ల ఆదాయం పొందింది.

బెంచ్‌మార్క్
కోల్ ఇండియా గత సంవత్సరంలో దాదాపు 46% జంప్ చేయగా, రాష్ట్రీయ కెమికల్స్ 58% లాభపడింది, బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ దాదాపు 6% అడ్వాన్స్‌ను అధిగమించింది.


Click it and Unblock the Notifications