Stock Market: ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లను తమ రాబడులతో ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు వరుసగా గడచిన ఏడాది కాలంలో మార్కెట్లోకి కొత్త కంపెనీలు తమ ఐపీవోలను లాంచ్ చేశాయి.
దీంతో భారత స్టాక్ మార్కెట్ల మెుత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ నవంబర్ 29, 2023న సరికొత్త మైలురాయి 4 ట్రిలియన్ డాలర్లను అందుకుంది. వాస్తవానికి మే 2021లో దేశీయ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్ 3 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకిన సంగతి తెలిసిందే. అయితే తక్కువ కాలంలోనే 1 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించటం వెనుక అనేక కంపెనీలు, రంగాలు ఉన్నాయి.

రెండేళ్ల కాలంలోనే మార్కెట్ క్యాప్ 1 ట్రిలియన్ డాలర్లు పెరగటానికి ప్రధానంగా ఆర్థిక సేవల రంగం అతిపెద్ద సహకారాన్ని అందించింది. ఈ ప్రయాణంలో టాప్-20 కంపెనీల వాటా 36.5% కాగా, టాప్-50 కంపెనీల వాటా 56.7%గా నిలిచింది. అంటే 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువలో టాప్-50 కంపెనీలు మాత్రమే 567 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కలిగి ఉన్నాయి.
ఇందులో ఐటీసీ 32.98 బిలియన్ డాలర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 32.85 బిలియన్ డాలర్లు, భారతీ ఎయిర్‌టెల్ 30.71 బిలియన్ డాలర్లు, ఎల్ అండ్ టీ 28 బిలియన్ డాలర్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 22.39 బిలియన్ డాలర్లు, అదానీ పవర్ 21.47 బిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 20.65 బిలియన్ డాలర్లు, టైటాన్ 19.4 బిలియన్ డాలర్లు తోడ్పాటును అందించాయి.
రంగాల వారీగా పరిశీలిస్తే.. ఆర్థిక సేవల రంగం 178.08 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సృష్టించింది ఒక ట్రిలియన్ మార్కెట్ విలువలో ఎక్కువ వాటాను కలిగి ఉంది. దీని తర్వాత క్యాపిటల్ గూడ్స్ 145.18 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ అండ్ కాంపోనెంట్స్ సెక్టార్ 81.99 బిలియన్ డాలర్లు, FMCG సెక్టార్ 73.11 బిలియన్ డాలర్లు, పవర్ 69.16 బిలియన్ డాలర్లు తోడ్పాటును అందించాయి. అలాగే వేగవంతమైన పెరుగుదలకు ప్రధాన కారణం ఐపీవోల రూపంలో మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త కంపెనీల లిస్టింగ్ అని కొట్టిపారేయలేము.


Click it and Unblock the Notifications