వచ్చేసింది! ఇప్పుడు ChatGPT ద్వారా UPI చెల్లింపులు కూడా చేయొచ్చు… అన్నీ ఒక్క చోటే!
ఈ డిజిటల్ యుగంలో భారతదేశం వేగంగా మారుతున్నది. మొబైల్ ఫోన్ల వినియోగం, ఆన్‌లైన్ షాపింగ్, UPI చెల్లింపులు ఇవన్నీ ఇప్పుడు మన రోజువారి జీవితంలో ముఖ్య భాగాలయ్యాయి. AI టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఫోన్ల ఉపయోగం కూడా మరింత స్మార్ట్‌గా మారింది. ఇప్పుడు మనకు కావలసిన ప్రోడక్ట్స్‌ను ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే, ఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఆ వెబ్‌సైట్‌లో వెళ్లి, UPI లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా కేవలం కొన్ని క్లిక్‌ల్లో కొనుగోలు కూడా చేయగలుగుతాము. ఇప్పుడు AI ఈ మొత్తం ప్రక్రియను మన కోసం సులభతరం చేస్తోంది. చాట్ ద్వారా ప్రోడక్ట్ బ్రౌజ్ చేయడం, ధరలు పోల్చడం, చివరకు సురక్షిత UPI చెల్లింపు వరకు చేసుకోవచ్చు.
NPCI మరియు Razorpay మైక్రోసాఫ్ట్ OpenAI తో కలిసి ChatGPT ద్వారా నేరుగా UPI చెల్లింపులు చేయగల పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ ప్రయత్నం వినియోగదారులు ఉత్పత్తులను చూసి, కొనుగోలు పూర్తి చేసే మొత్తం ప్రక్రియ AI ద్వారా ఎలా సులభంగా చేయొచ్చో పరీక్షించడానికి జరుగుతోంది.

ఈ పైలట్ "ఏజెంటిక్ AI" ను చెల్లింపుల్లో ప్రవేశపెట్టింది. అంటే, వినియోగదారులు ChatGPT తో చాట్ చేస్తూ ఉత్పత్తులను బ్రౌజ్ చేసి, అదే సంభాషణలో సురక్షితంగా UPI చెల్లింపులు చేయగలుగుతారు. Razorpay CEO హర్షిల్ మథూర్ మాట్లాడుతూ, "AI అసిస్టెంట్లను సింపుల్ డిస్కవరీ టూల్స్ నుండి పూర్తి షాపింగ్ సహచరులుగా మార్చడం ఈ పైలట్ లక్ష్యం" అని తెలిపారు.
ఈ సిస్టమ్ పూర్తిగా సురక్షితం. ఇది UPI ధృవీకరణ లేయర్లను ఉపయోగిస్తు బయోమెట్రిక్ లేదా PIN ఆధారిత వెరిఫికేషన్ ద్వారా ట్రాన్సాక్షన్ ఆమోదం ఇస్తారు. ChatGPTకి వినియోగదారుల UPI PIN లేదా పాస్‌వర్డ్‌కు యాక్సెస్ ఉండదు. అదనంగా, UPI రిజర్వ్ పే ఫీచర్ ద్వారా వినియోగదారులు కొంత నిధిని ముందుగా రిజర్వ్ చేసుకుని మాత్రమే చెల్లింపు పూర్తిచేయగలుగుతారు.
యాక్సిస్ బ్యాంక్ మరియు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అధికారిక భాగస్వాములుగా ఉన్నారు. Bigbasket ఈ ఫీచర్‌ను తన షాపింగ్ వర్క్‌ఫ్లోలో మొదటగా ఇంటిగ్రేట్ చేసింది. OpenAI ఇండియా MD ఒలివర్ జే చెప్పినట్టుగా, "NPCI తో కలిసి AI ను UPIలో ఎలా వాడవచ్చో చూడటం ఆసక్తికరమైన అవకాశం." ఇదే సమయంలో, Cashfree అనే మరో ఫిన్టెక్ కంపెనీ కూడా వ్యాపారుల కోసం AI ఆధారిత చెల్లింపుల సొల్యూషన్ విడుదల చేసింది. దీని ద్వారా భారతదేశంలో AI ద్వారా చెల్లింపుల పోటీ మొదలైంది.
ఈ పైలట్ విజయవంతమైతే, ChatGPT కేవలం చాట్ టూల్ కాకుండా, నిజమైన డిజిటల్ అసిస్టెంట్‌గా మారి ఫైనాన్షియల్ పనులను సురక్షితంగా పూర్తి చేయగలదు. దీని ద్వారా వినియోగదారులు తమ పాస్‌వర్డ్, బ్యాంక్ వివరాలను ఎప్పటికీ AIకి ఇవ్వనవసరం లేకుండా, సులభంగా UPI చెల్లింపులు, షాపింగ్, బిల్ పేమెంట్ వంటి పనులు చేయగలుగుతారు. అలాగే, ఇది భవిష్యత్తులో సంభాషణ AI
ని మరింత స్మార్ట్, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడానికి దారితీస్తుంది. చిన్న వ్యాపారాలు, వ్యాపారులు కూడా AI సహాయంతో తక్షణ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను నిర్వహించగలుగుతారు, ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేస్తుంది.


Click it and Unblock the Notifications