నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్) వార్షిక వ్యూహాత్మక సమీక్ష నివేదిక విడుదలైంది. భారతదేశ సాంకేతిక పరిశ్రమ ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి $253.9 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో టెక్ ఇండస్ట్రీ బాడీ అంచనా వేసిన 8.4 శాతం వృద్ధితో పోలిస్తే, మొత్తం వృద్ధి అంచనా సింగిల్ డిజిట్‌కు తగ్గింది.
ఇందుకు డీల్ క్లోజర్లలో జాప్యం, కస్టమర్ల సాంకేతిక బడ్జెట్ కోతలు, లేఆఫ్‌లు, స్థూల ఆర్థిక ప్రతికూలతల కారణంగా పేర్కొంది. ఐటీ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.8% పెరిగి 254 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ సేవలలో పరిశ్రమ FY24లో $9.3 బిలియన్ల ఆదాయాన్ని పెంచుతోందని పేర్కొంది.

ప్రస్తుతం ఆర్థిక మందగమనంలో ఉన్న ఉత్తర అమెరికా వంటి మార్కెట్ల నుంచి 60 శాతానికి పైగా ఆదాయాన్ని పొందుతున్నాయి భారతీయ టెక్ కంపెనీలు. దేశం యొక్క భవిష్యత్తు సాంకేతికతపై ఆధారపడి ఉంటుందని కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ & ఎండీ, నాస్కామ్ చైర్‌పర్సన్ రాజేష్ నంబియార్ చెప్పారు. మొత్తంమీద తాము $250 బిలియన్ల ఆదాయంతో గ్లోబల్ సోర్సింగ్ హబ్‌గా మొదటి స్థానంలో ఉన్నామని వెల్లడించారు.
ఫార్చ్యూన్ 500 కంపెనీలలో దాదాపు 90% భారతీయ టెక్ కంపెనీల కస్టమర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. భారతదేశపు GDPకి తాము గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం పరిశ్రమకు కొద్దిగా నెమ్మదిగా ఉన్నప్పటికీ పుంజుకునే అవకాశం ఉందన్నారు.యూఎస్, యూకే వంటి ఇతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా ఉన్న సమయంలో పరిశ్రమ వృద్ధి సంఖ్యలు మందగించడం జరిగిందన్నారు.
"కరోనా సంవత్సరంలో చాలా ఎక్కువ నియామకాలు జరిగినందున, పరిశ్రమకు ఆశించిన, అవసరమైన కొన్ని స్థాయి సవరణలు జరుగుతున్నాయని మేము చూస్తున్నాము" అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ అన్నారు. ఐటీ ఇండస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిగ్ డేటా, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ మొదలైనవి వంటిపై అధారపడే అవకాశం ఉందన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications