కరోనా లాక్ డౌన్ తరువాత ఇప్పుడు మళ్లీ ఐటీకి రోజులు కలిసొస్తున్నాయి. ఒక్కప్పుడు ఐటీ పేరు మారుమోగినప్పటికీ కరోనా సమయంలో ఉద్యోగాల కోత తలెత్తింది. దింతో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే రానున్న నెలల్లో మళ్ళి ఐటీ రంగం ఉపందుకోనుంది. క్వేస్ కార్ప్ అనే బిజినెస్ సర్వీస్ కంపెనీ ప్రకారం రానున్న 6 నెలల్లో ఐటీ సర్వీసెస్ విభాగంలో నియామకాలు 10-20 శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈ రిపోర్ట్ టెక్కీలకు మంచి రోజులు రాబోతున్నట్లు సూచిస్తుంది. మారుతున్న కాలానికి తగ్గట్టు ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీలు, ఆర్ధిక వ్యవస్థలు అప్ డేట్ అవుతుండటం ఇందుకు కారణమని చెప్పవచ్చు.
జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు 2030లోగ 10 లక్షల ఉద్యోగులని సృష్టిస్తాయని వెల్లడించిండి. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ తో పోలిస్తే జులై- సెప్టెంబర్లో ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) 71 శాతం, సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణులకు 58 శాతం డిమాండ్ పెరిగినట్లు రిపోర్టులో వెల్లడైంది. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో నిపుణులకు డిమాండ్ పై క్లారిటీ అందించేందుకు క్వెస్ కార్ప్ చేసిన రీసర్చ్ ఆధారంగానే ఈ రిపోర్ట్ రూపొందించడం జరిగింది.

ERP, డెవలప్‌మెంట్, టెస్టింగ్, డేటా సైన్స్, నెట్ వర్కింగ్ వంటి టాప్ స్కిల్స్ సెక్టార్లో నిపుణులకు సగటున డిమాండ్ 79 శాతం పెరిగింది. సైబర్ సెక్యూరిటీ 20 శాతం, జావా 30 శాతం, డెవ్ ఆప్స్ 25 శాతం వంటి స్కిల్స్ కి కూడా డిమాండ్ పెరిగింది. టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ డిమాండ్ విషయంలో ఐటీ సర్వీసెస్ సంస్థలే 37 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో హైటెక్ (11 శాతం), కన్సల్టింగ్ (11 శాతం), తయారీ (9 శాతం), బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్సియల్ సేవలు (BFSI) సంస్థల వాటా 8 శాతంగా ఉంది. ఇండియాలో ఎక్స్పర్ట్స్ నియామకాలకు జీసీసీలే ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. ఏఐ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డెవ్ యాప్స్, అనలిటిక్స్ వంటి టెక్నాలజీ స్కిల్స్ అవసరం ఉన్న ఉద్యోగాలకు హై డిమాండ్ ఉండటం ఇందుకు సహకారం చేస్తుంది.
నిపుణులకు మంచి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్రస్తుతానికి బెంగళూరు టాప్ లో ఉండగా హైదరాబాద్ 43.5 శాతంతో రెండో స్థానంలో, పుణె (10 శాతం) మూడో స్థానంలో కొనసాగుతోంది. నిపుణులకు డిమాండ్ విషయంలో దక్షిణ ప్రాంతం 62 శాతంతో టాప్‌లో ఉండగా పశ్చిమ 14 శాతం, ఉత్తరాది 8 శాతం, తూర్పు 0.4 శాతంతోనే ఉండటం గమనార్హం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications