IT Raids: నిన్న సంచులకొద్ది డబ్బు.. నేడు బంగారు బిస్కెట్లు.. కాంగ్రెస్ ఎంపీ సంచలనం..
Dhiraj Sahu: తవ్విన కొద్ది కట్టులు కట్టలు డబ్బు ఐటీ సోదాల్లో దొరకటం గతవారం నుంచి సంచలనంగా మారిపోయింది. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. ప్రస్తుతం బంగారు బిస్కెట్లు, గోల్డ్ ఆభరణాలు సైతం భారీగా బయటపడుతున్నాయి.
'క్యాష్ కింగ్'గా వార్తల్లో నిలుస్తున్న కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూ ఆస్తులకు సంబంధించి సంచలనాలు బయటపడుతూనే ఉన్నాయి. ఒకవైపు రాంచీలోని సుశీలా నికేతన్ నివాసంలో దాడులు కొనసాగుతుండగా.. మరోవైపు ఒడిశాలో వారికి సంబంధించిన డిస్టిలరీ కంపెనీ ఆస్తులపై కూడా ఆదాయపు పన్ను శాఖ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో బోలంగీర్‌లోని టిట్లాగఢ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకుకు చెందిన మూడు లాకర్ల నుంచి 40 గోల్డ్ బిస్కెట్లు, వజ్రాభరణాలు, ముఖ్యమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీనికి ముందు జరిపిన సోదాల్లో దాదాపు రూ.350 కోట్లకు పైగా కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఒడిశా వివిధ ప్రాంతాల్లోని బ్యాంక్ అధికారులు ఆదివారం రాత్రి బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నిషేధిత కంట్రీ లిక్కర్ షాపులో స్వాధీనం చేసుకున్న రూ.350 కోట్ల నగదు లెక్కింపును పూర్తి చేశారు. దీనికి కాంగ్రెస్ ఎంపీ సాహుతో లోతైన సంబంధాలు ఉన్నాయి. గతంలో ఇంత భారీ స్థాయిలో డబ్బు ఏ దర్యాప్తు సంస్థ సోదాల్లోను బయటపడలేదని నివేదికలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా 2023-24 ఎక్సైజ్ పాలసీ ప్రకారం అన్ని లైసెన్స్ షరతులు పాటించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలోని అన్ని OS షాపులను తనిఖీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ఎక్సైజ్ కమీషనర్ నరసింగభోలామాట్లాడుతూ షాపులను తనిఖీ చేయడం, దుకాణాల్లో లైసెన్స్ షరతులు పాటిస్తున్నారని నిర్ధారించుకోవడం తమ రెగ్యులర్ పని అని పేర్కొన్నారు. దీంతో వారం రోజుల్లో 22 జిల్లాల్లోని దుకాణాల రిజిస్ట్రేషన్ పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
జార్సుగూడలోని 14 షాపుల్లో ఏడు, రాయ్‌గఢ్‌లోని 15 షాపుల్లో ఐదు, సంబల్‌పూర్ జిల్లాలో 32 షాపుల్లో నాలుగు షాపులను బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లిమిటెడ్ కలిగి ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బోలంగీర్ నుంచి స్వాధీనం చేసుకున్న నగదు కేవలం మద్యం వ్యాపారం నుంచి మాత్రమే కాదు. ఎందుకంటే సీజ్‌లు అసాధారణమైన లాభాలను చూపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత భారీ మెుత్తంలో నగదును నిల్వ చేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరికొందరైతే ఎన్నికలకు ముందు బీజేపీ భారీ తిమింగలాన్ని పట్టిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications