IT Raids on Dil Raju: సంక్రాంతికి కాసుల వర్షం కురిపించిన సినిమాల కిక్కు ఆస్వాధించే లోపే ఐటీ సోదాలు తెలుగు సినీ ప్రొడ్యూసర్లను ఆందోళనకు గురిచేశాయి. గడచిన నాలుగు రోజులుగా నిర్మాతల ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు సంచలనంగా మారాయి.
ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో కొనసాగుతున్న నిర్మాత దిల్ రాజ్ ఇంట్లో ఐటీ సోదాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఆయనే స్వయంగా వివరణ ఇస్తూ కేవలం తన ఒక్కడి ఇంట్లో మాత్రమే సోదాలు జరగటం లేదని తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది నిర్మాత ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయని ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదని స్పష్టతను ఇచ్చారు. ఈ క్రమంలో నేడు దిల్ రాజు ఇంట్లో సోదాలు ముగించిన అధికారులు మధ్యాహ్నం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుకు ఆయనను వెంటపెట్టుకుని తీసుకెళ్లారు.

ఈ క్రమంలో దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల నుంచి అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహా నిర్మాత శిరీష్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన్నారని సమాచారం. ఇదే క్రమంలో బలగం ప్రొడ్యూసర్ దిల్ రాజు కుమార్తె హన్సిత రెడ్డి ఇంటిని కూడా వదల్లేదని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దిల్ రాజు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కార్యాలయాలపై ఏకకాలంలో అధికారులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు. పుష్ప-2 భారీ వసూళ్లతో పాటు ఇటీవల పండక్కి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై పన్ను అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు పుష్ప రూ.1,800 కోట్లు వసూలు చేసినప్పటికీ తక్కువ మెుత్తంలో పన్ను చెల్లించటంపై వారి ఫోకస్ కొనసాగినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా ఐటీ శాఖ అధికారులు 18 ప్రదేశాల్లో 55 మంది బృందాలుగా విడిపోయి సోదాలు కొనసాగిస్తున్నారు. దీంతో పెద్ద ప్రొడ్యూసర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
రామ్ చరణ్ సంగతేంటి?
శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా మంచి రాబడులను తెచ్చిపెట్టిద్దని అందరూ భావించినప్పటికీ మూవీ లవర్స్‌ని స్టోరీ అలరించలేకపోయింది. ఈ క్రమంలో రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు కోసం తక్కువ జీతంతో మరో సినిమా చేసే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇకపోతే సంక్రాంతికి వస్తునం, డాకు మహారాజ్ సినిమాలు మంచి కలెక్షన్స్ దిల్ రాజుకు తెచ్చిపెట్టాయి.


Click it and Unblock the Notifications