Rocket Stock: 3 రోజుల్లో 36 శాతం పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్.. కిట్టీలో రూ.1000 కోట్లు, వావ్..
Ceinsys Tech Stock: స్టాక్ మార్కెట్లు ఇటీవల భారీగా ఒడిదొడుకులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ మాత్రం వీటితో సంబంధం లేకుండా తమ పెట్టుబడిదారుల సంపదను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలో ఒక కంపెనీ షేర్లు మాత్రం మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఐటీ రంగానికి చెందిన సెయిన్‌సిస్ టెక్ కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 9.5 శాతం మేర పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠమైన రూ.944 మార్కును అందుకున్నాయి. అలాగే గడచిన మూడు రోజులుగా కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు ఏకంగా 36 శాతం అద్భుతమైన రాబడిని అందించాయి. అయితే కంపెనీ షేర్లు భారీగా పెరగటానికి వెనుక పెద్ద కారణం ఒకటి ఉందని వెల్లడైంది. అదేంటంటే ప్రస్తుతం కంపెనీ తన ఆర్డర్ బుక్ రూ.1000 కోట్లకు పైగా ఉందని ప్రకటించటమే. ఈ క్రమంలోనే అక్టోబర్ 8న కంపెనీ మహారాష్ట్ర స్టేట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ నుంచి రూ.332 కోట్ల ఆర్డర్ లేఖను అందుకోవటం పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు.

ప్రభుత్వం నుంచి అందుకున్న డీల్ కింద ఈ ఒప్పందంలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్‌ల కోసం కేంద్రీకృత IoT ప్లాట్‌ఫారమ్ రూపకల్పన, అమలు, నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందని వెల్లడైంది. అయితే ఇందులోనే 5 ఏళ్లకు సంబంధించిన మెయింటెనెన్స్ ఆర్డర్లు కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో కంపెనీ సిడ్కో నుంచి రూ.29.2 కోట్ల విలువైన ఆర్డర్ అందుకోగా ఇందులో డ్రోన్ సర్వేలు, బేస్ మ్యాప్‌లు, యుటిలిటీ లేయర్‌ల సృష్టి, ఎంటర్‌ప్రైజ్ GIS అప్లికేషన్‌ల రూపకల్పన, అభివృద్ధి ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 51.86 శాతం వాటాలు ఉండగా.. మిగిలిన వాటా పబ్లిక్ వద్ద ఉన్నాయి.
గత ఏడాది మార్చి నుంచి కంపెనీ షేర్లలో మెుమెంటం ప్రారంభమైందని మనం గమనించవచ్చు. ఈ క్రమంలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.127 స్థాయి నుంచి 626 శాతం పెరిగి ప్రస్తుతం రూ.944 స్థాయికి చేరుకున్నాయి. అలాగే గత ఏడాది ఇదే నెలలో స్టాక్ ధర 70 శాతానికి పైగా లాభపడి మల్టీబ్యాగర్ రాబడులను ఇన్వెస్టర్లకు అందించింది. ఇదే క్రమంలో స్టాక్ 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 160 శాతం రాబడిని అందించింది.


Click it and Unblock the Notifications