Hyderabad: హైటెక్స్‌లో ఈ-మోటార్ షో ప్రారంభించిన KTR.. ఐటీ మినిస్టర్ ఏమన్నారంటే..
Hyderabad: వార్షిక హైదరాబాద్ e-మొబిలిటీ వీక్‌లో భాగంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ ఈ-మోటార్ షో 2023ని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిట్రోయెన్ ఇండియాకు చెందిన eC3 ఆల్-ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ హాప్ OXO, క్వాంటమెవ్ ఇండియా ప్లాస్మా వాహనాలను మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ కరంపురి సుజయ్, సాఫ్ట్‌వేర్ బిజినెస్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్, గ్లోబల్, అమెరికా, ఆసియాస్ స్టెల్లాంటిస్ తదితరులు పాల్గొన్నారు.

రానున్న కాలంలో రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో ఈవీలకు మారుతున్నదానిపై మంత్రి కేటీఆర్ ప్రస్థావించారు. ఆటోమొబైల్ కంపెనీలు తమ తదుపరి తరం EV మోడళ్లను విడుదల చేయడానికి, ప్రదర్శించడానికి ఈ-మోటార్ షో ఒక అత్యుత్తమ వేదికగా అవతరిస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

TMV అత్యుత్తమ మౌలిక సదుపాయాలను సృష్టిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి తోడు తెలంగాణను తయారీ పరిశోధన మరియూ అభివృద్దికి పోటీ గమ్యస్థానంగా మారుస్తుందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే తెలంగాణ ఐటీ, రియల్టీ వంటి రంగాల్లో మంచి గుర్తింపుతో పాటు పురోగతికి సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరంలో జరగటం ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలిసారిగా నగరంలో ఈవీ వాహనాలతో రేసింగ్ జరగటంపై నగరవాసులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications