For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, జొమాటో సహా ఈ స్టాక్స్ మాత్రం అదుర్స్

|

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం కాస్త సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు, కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు, చివరకు నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా ఐటీ, మెటల్ స్టాక్స్ దెబ్బతీశాయి. ఈ రంగాలు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బలహీనమైన అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో నేటి ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 54,052 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు క్షీణించి 16,125 పాయింట్ల వద్ద ముగిసింది.

మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడింది. కానీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి జారుకుంది. చివరలో కాస్త కోలుకున్నది. కానీ ఆరంభ నష్టాలు మాత్రం ఆవిరయ్యాయి.

IT, Metals drag Sensex 236 points down: These stocks are up over 10 percent

సెన్సెక్స్ 54,307.56 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,524.37 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,225.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,262.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,078.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

ఈ స్టాక్స్ మాత్రం అదుర్స్

నేడు మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ పలు స్టాక్స్ మాత్రం అదరగొట్టాయి. అందులో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో 13 శాతం, శిల్పా మెడికేర్ 11.17 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో 11 స్టాక్స్ లాభాల్లో, 39 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

English summary

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, జొమాటో సహా ఈ స్టాక్స్ మాత్రం అదుర్స్ | IT, Metals drag Sensex 236 points down: These stocks are up over 10 percent

Equity markets swung in trade amid lack of fresh triggers for a decisive move. The S&P BSE Sensex see-sawed between 54,524 and 53,886 a range of 638 points before settling the day at 54,053, down 236 points.
Story first published: Tuesday, May 24, 2022, 17:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X