Wipro: మార్కెట్ అంచనాలు తప్పిన టెక్ దిగ్గజం విప్రో.. షేర్ల పరిస్థితి..?
Wipro Results: ఇన్వెస్టర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న టెక్ దిగ్గజం విప్రో నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. మార్కెట్లు ముగిసిన తర్వాత విడుదలై ఫలితాలు అన్ని టెక్ కంపెనీల్లాగానే మార్కెట్ అంచనాలను అందుకోవటంలో విఫలమైంది.
విప్రో మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 0.4 శాతం క్షీణించి రూ.3,075 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో టెక్ కంపెనీ లాభం రూ.3,087 కోట్లుగా నిలిచింది. అయితే క్యూ-3లో రూ.3,053 కోట్ల కంటే విప్రో లాభం స్వల్పంగా వృద్ధి చెందింది.

వ్యాపార కార్యకలాపాల ద్వారా నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.23,190 కోట్లుగా ఉంది. అయితే గత ఏడాది ఇదే సమయంలో రూ.20,860 కోట్ల కంటే ఈసారి ఆదాయం 11.2 శాతం పెరిగింది. కానీ క్యూ-3 లో నమోదు చేసిన రూ.23,229 కోట్ల కంటే కొంత మేర తగ్గుదల నమోదైంది.
బ్రోకరేజ్ కంపెనీలు నిర్వహించిన పోల్ లో కంపెనీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.23,505 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. కానీ వాస్తవ సంఖ్యలు ఈ అంచనాలను అందుకోలేక పోయాయి. అయితే ఫలితాలకు కొన్ని రోజుల ముందర కంపెనీ తన ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించింది. దీని ద్వారా మెుత్తం 26.96 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో షేరుకు రూ.445 చెల్లించి రూ.12,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతిపాదించింది.


Click it and Unblock the Notifications