Wipro Salary Hike: గడచిన రెండు ఏళ్లుగా భారతీయ ఐటీ రంగం భారీ ఒడిదొడుకులను చూసింది. ఈ క్రమంలో ప్రాజెక్టులు తగ్గిపోవటంతో పాటు, భారీ డీల్స్ తగ్గిపోయాయి. ఇది పరోక్షంగా ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో తిరిగి సాధారణ పరిస్థితులు దగ్గరపడుతున్నాయి.
ఈ క్రమంలో భారతీయ టెక్ కంపెనీలు తమ రిక్రూట్మెంట్ సీజన్ ప్రారంభించాయి. తాజాగా దేశంలోని నాల్గవ అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో తన ఉద్యోగులకు పెద్ద శుభవార్తను సిద్ధం చేస్తోంది. అత్యుత్తమ పనితీరు కలిగిన టెక్కీలకు 8 శాతం వేతన పెంపును అందించనున్నట్లు సమాచారం. గడచిన ఏడాది కంపెనీ సగటున 6% శాలరీ హైక్ అందించింది. కానీ ప్రస్తుతం ఐటీ రంగంలోని పరిస్థితులు మెరుగుపడుతున్న వేళ పెంపులు అధికంగా ఉండనున్నాయని తెలుస్తోంది. పెంపులకు సంబంధించిన అంతర్గత పనితీరును పరిశీలిస్తే.. విప్రో 2,00,000 మంది ఆఫ్‌షోర్ ఉద్యోగులు, వీరిలో మూడింట మూడొంతుల మంది క్లయింట్ లొకేషన్‌లకు దూరంగా పనిచేస్తుండగా.. వారు దాదాపు 8 శాతం పెంపును పొందవచ్చని తెలుస్తోంది.

అయితే క్లయింట్ లొకేషన్ నుంచి పనిచేసే టెక్కీలకు దాదాపు 3 శాతం వేతన పెంపు ఉండనున్నట్లు సమాచారం. విప్రో చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఆగస్టు 29న ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్ ప్రకారం వేతన పెంపు సైకిల్ సెప్టెంబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించారు. సాధారణంగా కంపెనీ సెప్టెంబరు-అక్టోబర్‌లో ఇంక్రిమెంట్‌లను అందిస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రక్రియలను అన్ని టీమ్ మేనేజర్లకు అందిస్తారని గోవిల్ వెల్లడించారు. ఉద్యోగులకు కొత్తగా సవరించిన పరిహారం అక్టోబర్ పేరోల్‌తో పాటు సెప్టెంబర్ బకాయిలు కూడా అందుకోనున్నారు. టీసీఎస్ తర్వాత విప్రో వేతన పెంపులను ప్రకటించిన కంపెనీగా నిలిచింది.
టీసీఎస్ టాప్ పెర్ఫార్మర్‌లకు రెండంకెల వేతన పెంపుదలని అందించింది. మిగిలిన వారికి సగటున 4.5-7% వరకు అందించింది. అయితే నోయిడాకు చెందిన హెచ్‌సీఎల్ టెక్, బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ లిమిటెడ్‌తో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే మార్చి 2024తో ముగిసిన సంవత్సరంలో హోల్-టైమ్ డైరెక్టర్లు మినహా ఉద్యోగులకు విప్రో సగటు జీతం 9.43% పెరిగింది.
ఉద్యోగులకు కొత్త కష్టాలు..
దేశీయ టాప్ టెక్ దిగ్గజాల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో తన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో టెక్కీలు ఆఫీసు నుంచి పనిచేయటాన్ని సెలవులకు లింక్ చేసింది. నివేదిక ప్రకారం బెంగళూరుకు చెందిన టెక్ మేజర్ తన సిబ్బందికి వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయానికి హాజరు కావాలని లేదా హాజరుకాని రోజులకు లీవ్స్ కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగులకు మెయిల్ ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇంటి నుండి పని చేసేందుకు ఉద్యోగుల అభ్యర్థనలను అనుమతించవద్దని మేనేజ్‌మెంట్ HR బృందానికి సెప్టెంబర్ మెుటది వారంలోనే ఆదేశాలు జారీచేసినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications