Wipro News: ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం ఛాయలు దాదాపుగా చివరి అంకానికి చేరాయి. ఈవారం జరగనున్న ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఇది ఐటీ రంగం పునరుద్ధరణను సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు తిరిగి గాడిన పడతాయనే సంకేతాలు ఇప్పటికే మెుదలయ్యాయి. దీంతో ఐటీ కంపెనీలు సైతం తిరిగి భారీగా రిక్రూట్మెంట్స్ కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో టెక్ కంపెనీలు సైతం కఠినంగా వ్యవహరిస్తున్నాయి. భారతీయ టెక్ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు కరోనా సమయంలో అందించిన వర్క్‌ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని ఇప్పటికే తొలగించగా, వ్యాపారాలు బూస్ట్ అవుతున్న వేళ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేపనిలో కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో దేశీయ టాప్ టెక్ దిగ్గజాల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రో తన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో టెక్కీలు ఆఫీసు నుంచి పనిచేయటాన్ని సెలవులకు లింక్ చేసింది. నివేదిక ప్రకారం బెంగళూరుకు చెందిన టెక్ మేజర్ తన సిబ్బందికి వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయానికి హాజరు కావాలని లేదా హాజరుకాని రోజులకు లీవ్స్ కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగులకు మెయిల్ ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇంటి నుండి పని చేసేందుకు ఉద్యోగుల అభ్యర్థనలను అనుమతించవద్దని మేనేజ్‌మెంట్ HR బృందానికి సెప్టెంబర్ మెుటది వారంలోనే ఆదేశాలు జారీచేసినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి.
హ్యూమన్ రిసోర్సెస్ టీమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థనలను వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగులను వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి హాజరు కావాలనే విషయాన్ని అన్ని టీమ్స్‌కు మెయిల్ ద్వారా తెలిపినట్లు విప్రో ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కొత్త పాలనీ ప్రకారం ఎవరైనా ఉద్యోగి వారంలో మూడు రోజులు ఆఫీసుకు హాజరుకాకపోతే అతడు పనిచేసినప్పటికీ.. కార్యాలయంలో భౌతికంగా హాజరుకాని రోజును సెలవుగా పరిగణించబడతాయని స్పష్టం చేసింది.
వాస్తవానికి తొలుత ఈ పద్ధతిని భారతీయ టెక్ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తొలుత తన సంస్థలో ప్రవేశపెట్టింది. అయితే టీసీఎస్ ఇక్కడ తన ఉద్యోగుల వేరియబుల్ వేతనాన్ని కార్యాలయ హాజరుతో అనుసంధానించింది. టాటా గ్రూప్ తన ఉద్యోగులు వారంలో 5 రోజులు తప్పనిసరిగా ఆఫీసుల నుంచే పనిచేయాలని, ఇంటినుంచి పనికి పూర్తిగా స్వస్తి పలికింది. అలాగే మరో టాప్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను కనీసం మూడు రోజుల-వారం ఆఫీసు నుండి పని చేయాలని సూచించింది. ఇక చివరిగా LTIMindtree ఉద్యోగుల హాజరును ఇటీవల సెలవులను లింక్ చేసింది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications