TCS News: టీసీఎస్ షేర్ల బైబ్యాక్‌కు భారీగా డిమాండ్.. ఏడు సార్లు టెండర్లు..
Shares Buy Back: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈక్విటీ పెట్టుబడిదారుల నుంచి తన షేర్లను తరిగి కొనుగోలు చేస్తోంది. అయితే తాజా దఫాలో కంపెనీ రూ.17,000 కోట్ల విలువైన షేర్లను తరిగి కొనుగోలు చేస్తోంది.
అయితే టీసీఎస్ తాజా షేర్ల బైబ్యాంక్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పెట్టుబడిదారులు కంపెనీ కొనుగోలు చేయాల్సిన షేర్ల కంటే ఏడు రెట్లు అధికంగా తమ షేర్ల విక్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో గరిష్ఠంగా 4.01 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ.. మెుత్తం 26.9 కోట్ల షేర్లకు టెండర్లు వచ్చినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి టీసీఎస్‌లో ప్రమోటర్ల వాటా 72.3 శాతంగా ఉంది.

టీసీఎస్ షేరు 0.4 శాతం లాభంతో రూ.3,617 వద్ద ముగిశాయి. TCS టెండర్ ద్వారా బైబ్యాక్ ధరను ఒక్కో షేరుకు రూ.4,150గా నిర్ణయించింది. ఇది గత ముగింపు ధర కంటే దాదాపు 15 శాతం ఎక్కువ. కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం.. రికార్డు తేదీ నవంబర్ 25న TCS షేర్లను కలిగి ఉన్న వాటాదారులు మాత్రమే షేర్ల బైబ్యాక్‌లో పాల్గొనేందుకు అర్హులు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఆఫర్‌పై ఆర్బిట్రేజ్ ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశ్యంతో రికార్డు తేదీకి ముందే TCS షేర్లను కొనుగోలు చేశారు.
2022లో TCS అతిపెద్ద బైబ్యాక్‌లో రూ.18,000 కోట్ల విలువైన షేర్లను మార్కెట్ నుంచి తిరిగి కొనుగోలు చేసింది. ఇందులో రిటైల్ పెట్టుబడిదారుల ఆమోదం నిష్పత్తి 14 నుంచి 21 శాతం మధ్య, సాధారణ వర్గానికి 1-9 శాతం మధ్య ఉంది. రిటైల్ పెట్టుబడిదారుల అంగీకార నిష్పత్తి 2017, 2018 సంవత్సరాల్లో 100 శాతంగా ఉంది. అంటే ఈ రెండు సంవత్సరాల్లో టీసీఎస్ నిర్వహించిన బైబ్యాక్‌లలో రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకానికి దరఖాస్తు చేసిన అన్ని షేర్లను కంపెనీ కొనుగోలుకు అంగీకరించింది.
2017-2022 మధ్య కాలంలో TCS నాలుగు సార్లు షేర్ల బైబ్యాక్ నిర్వహించింది. ఇందులో భాగంగా మెుత్తం రూ.66,000 కోట్ల విలువైన షేర్లను ఇన్వెస్టర్ల నుంచి తిరిగి కొనుగోలు చేసింది. ఈ బైబ్యాక్ కార్యక్రమాలన్నింటిలో టాటా సన్స్ రూ.41,895 కోట్ల విలువైన షేర్లను టెండర్ చేసింది.


Click it and Unblock the Notifications