TCS Salary Increments: ఐటీ పరిశ్రమలోని కంపెనీలు గడచిన కొన్ని త్రైమాసికాలుగా వ్యాపారం కోలుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ తమ ఉద్యోగులకు సైతం వేతన పెంపులను ఆఫర్ చేస్తున్నాయి. దీనికి ముందు కంపెనీలు తమ వేతన పెంపు సైకిళ్లను తర్వాతి త్రైమాసికాలకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఇన్ఫోసిస్ వేతన పెంపులను ప్రకటించగా.. తాజాగా టీసీఎస్ తన ఉద్యోగులకు శివరాత్రికి ముందే శాలరీ హైక్స్ అందించటానికి సిద్ధమైంది.
దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఎదిగిన టాటా గ్రూప్ కంపెనీ అయిన టీసీఎస్ 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగులకు వేతన పెంపులను రోలవుట్ చేసింది. ఈ క్రమంలో సదరు ఉద్యోగులకు శాలరీ హైక్ లెటర్స్ మార్చిలో పంపించటానికి సిద్ధమైంది. అయితే దీని ప్రకారం పెంచబడిన వేతనాలు ఏప్రిల్ నెల వేతనాలతో కలిపి ఉద్యోగులు అందుకుంటారని కంపెనీ చెబుతోంది. ఈ క్రమంలో టెక్ దిగ్గజం ఐటీ ఉద్యోగులకు సగటున 4 శాతం నుంచి 8 శాతం వరకు వేతన పెంపును అందించనున్నట్లు వెల్లడైంది.

కొన్ని రోజుల కిందట దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వేతన పెంపులను అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ తన ఉద్యోగులకు సగటున 5 శాతం నుంచి 8 శాతం మధ్య వేతన పెంపులను అందించనున్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో కంపెనీ వందల సంఖ్యలో ట్రైనీలను అకస్మాత్తుగా తొలగించటం కూడా పెద్ద చర్చకు దారితీసింది. కంపెనీ మైసూరు క్యాంపస్ నుంచి దాదాపు 400 మంది ఫ్రెషర్లను కంపెనీ అంతర్గత పరీక్షల్లో పాస్ కాకపోవటంతో తొలగించినట్లు ప్రకటించటం సంచలనంగా మారిపోయింది.
తక్కువగా వేతన పెంపులు..
దేశీయంగా ఐటీ సేవల కంపెనీలు గత కొన్ని త్రైమాసికాలుగా ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్న వేతన పెంపుల శాతం క్షీణతను చూస్తోంది. ప్రధానంగా కరోనా తర్వాత టెక్ కంపెనీలు 10 శాతానికి పైన అందిస్తున్న వేతన పెంపులను ప్రస్తుతం సింగిల్ డిజిట్ కి పరిమితం చేశాయి. టీసీఎస్ విషయానికి వస్తే కంపెనీ తన వేరియబుల్ పే, శాలరీ హైక్స్ ఉద్యోగుల హాజరుకు లింక్ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులను వారంలో 5 రోజుల పాటు తిరిగి ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహించే క్రమంలో కంపెనీ ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సగటున 7-9 శాతం మధ్య హైక్స్ అందించగా ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పైనే ఉన్న సంగతి తెలిసిందే.
ఇక వేరియబుల్ వేతనం అందించే విషయంలో కూడా ఇతర ఐటీ కంపెనీలతో పోల్చినప్పుడు ఇండియాలో టీసీఎస్ కొంత బెటర్ గానే ఉంది. అవును కంపెనీలో పనిచేస్తున్న మెుత్తం ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మందికి కంపెనీ 100 శాతం వేరియబుల్ వేతనాన్ని అందిస్తోందని వెల్లడైంది. కంపెనీలోని సీ3 బ్యాండ్ కింద ఉద్యోగులకు ఇది ఎక్కువగా దోహదపడిందని వెల్లడైంది. అలాగే సీనియర్ లెవెల్ ఉద్యోగులకు వేరియబుల్ పే 20-40 శాతం మధ్య చెల్లించబడిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications