Infosys News: ఉద్యోగుల పట్ల భారతీయ ఐటీ కంపెనీల్లో కొన్ని అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో టాప్ ఐటీ కంపెనీల్లో కొన్ని మాత్రం పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టాప్ రెండవ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురించే.
కరోనా సమయంలో కూడా ఫ్రెషర్ల పట్ల కంపెనీ తన కఠిన వైఖరిని చూపించిన సంగతి తెలిసిందే. చాలా కాలం ఉద్యోగంలోకి ఆన్ బోర్డ్ చేసుకోకుండా ఆలస్యం చేసింది. దీని తర్వాత ఆఫర్ లెటర్ లో ప్రకటించిన వార్షిక వేతనం కంటే తక్కువకు ఇష్టమైతే ఆన్ బోర్డ్ కావాలని కూడా కొన్ని షరతులు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే కొందరిని పరీక్షల పేరుతో తిరస్కరించిందనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు స్థిమితపడటంతో టెక్ కంపెనీలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా టాప్ టెక్ కంపెనీలు కొత్త ఉద్యోగులను ప్రధానంగా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తమ త్రైమాసిక ఫలితాల సమయంలో కూడా ప్రకటనలు చేశాయి.

తాజాగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో వరుసగా మూడు ప్రయత్నాల్లో అవాల్యుయేషన్ పరీక్షల్లో విఫలమైన ట్రైనీలను తెలగిస్తున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా దాదాపు 400 మందిని మైసూరు క్యాంపస్ నుంచి తొలగిస్తున్నట్లు విషయం తెలిసిన వర్గాల నుంచి బయటకు వచ్చింది. దీంతో ఉద్యోగులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శిక్షణ పొందిన వారిని కంపెనీ ఆన్ బోర్డింగ్ ప్రక్రియను ప్రారంభించిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుత నిర్ణయం వల్ల దాదాపు సగం మంది ట్రైనీలు ఉద్యోగం కోల్పోయినట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై ఇన్ఫోసిస్ కీలక ప్రకటన సైతం విడుదల చేసింది. కంపెనీలో తాము కఠినమైన నియామక ప్రక్రియను పాటిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. మైసూరు క్యాంపస్ లో ఫ్రెషర్లు శిక్షణ పొందిన తర్వాత అంతర్గత అసెస్‌మెంట్‌ను క్లియర్ చేయడానికి మూడు అవకాశాలను కలిగి ఉంటారని కంపెనీ వెల్లడించింది. వీటిని క్లియర్ చేయని వారు సంస్థలో కొనసాగటం కుదరదని స్పష్టం చేసింది. క్లయింట్‌లకు అధిక నాణ్యత గల ప్రతిభ లభ్యతను కలిగి ఉండాలని కంపెనీ ప్రయత్నిస్తోందని వెల్లడించింది.
ఈ క్రమంలో కంపెనీ ట్రైనీలను దాదాపు 50 మందితో కూడిన బ్యాచ్‌లుగా విభజించింది. పరీక్ష క్లియర్ చేయలేని వ్యక్తులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కొందరు ఫ్రెషర్లు స్పందిస్తూ కంపెనీ అన్యాయంగా వ్యవహరిస్తోందని, కావాలనే పరీక్షలను కఠినంగా ఉంచి తమను ఫెయిల్ చేసినట్లు అతను వాపోయాడు. దీని తర్వాత తమ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ట్రైనీలు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా చూసేందుకు కంపెనీ బౌన్సర్లు, భద్రతా సిబ్బందిని నియమించిందని వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం కల్లా క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలని కంపెనీ సూచించినట్లు వారు చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో ఇన్ఫోసిస్ పై తక్షణ జోక్యం, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖకు అధికారిక ఫిర్యాదు చేస్తున్నట్లు నసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ తెలిపింది. కఠోరమైన కార్పొరేట్ దోపిడీని కొనసాగించడానికి అనుమతించలేమని పేర్కొంది. ఉద్యోగుల హక్కులను కాపాడటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications