Infosys: పండక్కి ముందే శుభవార్త చెప్పిన ఇన్ఫోసిస్.. సంతోషంలో టెక్కీలు..
Infosys News: దిగ్గజ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. వ్యాపార అస్థిరతలతో ఉద్యోగుల వేతనాల పెంపు సైకిల్ గతంలో వాయిదా వేసిన కంపెనీ నూతన ఏడాదికి ముందు కీలక ప్రకటన చేసింది.
డిసెంబర్ 15న టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ పెద్ద సంఖ్యలో తన ఉద్యోగులకు జీతం సవరణ మెయిల్స్ పంపింది. దీనిలోని సమాచారం ప్రకారం టెక్కీలకు సగటున వేతనాన్ని కంపెనీ 10 శాతం కంటే తక్కువగా పెంచినట్లు వెలల్డైంది. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే వేతన పెంపులను ఇప్పుడు నవంబర్ 1, 2023 నుంచి వర్తిస్తాయని వర్తింపచేస్తోంది. అలాగే ఎంట్రీ లెవల్ ఉద్యోగులు ఈ సంవత్సరం వార్షిక పెంపులో కంపెనీ చేర్చలేదని వెల్లడైంది.

నవంబర్ 1, 2023 నుంచి ఉద్యోగి నిబద్దత, పనితీరును గుర్తిస్తూ చెల్లించే పరిహారాన్ని సవరించినందుకు సంతోషిస్తున్నట్లు కంపెనీ తన ఉద్యోగులకు మెయిల్స్ ద్వారా వెల్లడించింది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్.. ప్రస్తుత సవాళ్లను అధిగమించడానికి, అన్ని అంశాల్లో విజయాన్ని నిర్ధారించడానికి అసమానమైన మద్దతు, ప్రయత్నాలకు ఉద్యోగులకు మెయిల్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.
కంపెనీ నికర లాభం 3.17 శాతం పెరిగి రూ.6,212 కోట్లకు చేరుకుంది. ప్రస్తుత వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ పూర్తి సంవత్సరానికి తన ఆదాయ వృద్ధి మార్గదర్శకాన్ని ఎగువ ముగింపులో 1-2.5 శాతానికి తగ్గించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 7 శాతం పెరిగి రూ.38,994 కోట్లకు చేరుకుంది. అలాగే సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 21.2 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications