Infosys News: 2 బిలియన్ డాలర్ల AI డీల్ కొట్టేసిన ఇన్ఫోసిస్.. పూర్తి వివరాలు..
Infosys News: మెుదటి త్రైమాసికం ఆర్థిక ఫలితాల విడుదలకు ముందు భారీ ప్రకటన చేసింది. దేశీయ ఐటీ సేవల రంగంలో టాప్ కంపెనీగా కొనసాగుతున్న సంస్థ ప్రస్తుతం ఏఐపై దృష్టి సారించింది.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఆధారిత అభివృద్ధిని అందించడానికి దాని ప్రస్తుత వ్యూహాత్మక క్లయింట్‌లలో ఒక దానితో ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. అయితే డీల్ కుదుర్చుకున్న క్లయింట్ వివరాలను ఐటీ సేవల సంస్థ వెల్లడించకపోవడం గమనార్హం.

ఇన్ఫోసిస్ ప్రస్తుతం తనకు ఉన్న క్లయింట్ తో సేవలను ఆధునీకరించడం, నిర్వహణ కోసం 2 బిలియన్ డాలర్ల విలువైన డీల్ కుదుర్చుకున్నట్లు సోమవారం నాటి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ డీల్ మెుత్తం 5 ఏళ్ల పాటు కొనసాగుతుందని అందులో తెలిపింది. IT మేజర్ FY24 కోసం స్థిరమైన 4-7 శాతం ఆదాయ వృద్ధి, 20-22 శాతం నిర్వహణ మార్జిన్ మార్గదర్శకాలను అందించింది.
ప్రస్తుత సంవత్సరానికి ఇన్ఫోసిస్ ఇప్పటికే రెండు మెగా డీల్స్ గెలుచుకున్నట్లు ప్రకటించింది. బ్రిటిష్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ బిపితో మొదటి డీల్ 1.5 బిలియన్ డాలర్లు విలువైనది. రెండవ డీల్ డాన్స్కే బ్యాంక్‌తో 454 మిలియన్ డాలర్లతో కుదుర్చుకుంది. అయితే తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మ్యూట్ గ్రోత్ రిపోర్ట్ చేస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
BFSI, టెలికాం, హైటెక్ మరియు రిటైల్‌లలో డిమాండ్ అనిశ్చితి FY24 కోసం బలహీనమైన ప్రారంభానికి దారి తీస్తుందని ఫిలిప్ క్యాపిటల్ తన నివేదికలో కంపెనీ గురించి పేర్కొంది. అన్ని దిగ్గజ కంపెనీల మాదిరిగానే ఇన్ఫోసిస్ సైతం క్యూ-1లో ఉద్యోగులకు వేతన పెంపులను వాయిదా వేయవచ్చని అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications