Infosys: ఏడాది చివర్లో ఇన్ఫోసిస్‌కు భారీ దెబ్బ.. టెక్కీలకు ఇక కష్టాలు మెుదలే..!!
Infosys AI Deal: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగజారిన ఆర్థిక పరిస్థితులతో భారత ఐటీ సేవల కంపెనీలు టఫ్ టైమ్ ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో కంపెనీలకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి.
దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ ఊహించని ఎదురుదెబ్బకు గురైంది. కంపెనీ సెప్టెంబరులో గ్లోబల్ కంపెనీతో చేసుకున్న ఏఐ ఒప్పందం కుప్పకూలింది. దాదాపు రూ.12,500 కోట్లు విలువైన డీల్ రద్దుచేయబడినట్లు కంపెనీ శనివారం వెల్లడించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సొల్యూషన్స్ కోసం 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని గ్లోబల్ కంపెనీ ఇన్ఫోసిస్ తో కుదుర్చుకుంది. ఈ డీల్ మెుత్తం 15 ఏళ్ల కాలం కోసం సెప్టెంబర్ 2023లో ఖరారైన సంగతి తెలిసిందే. ఈ అవగాహన ఒప్పందం తర్వాత తాజాగా బ్రేకులు పడటంతో మూడు నెలల్లోనే అతిపెద్ద డీల్ ఐటీ దిగ్గజం బాస్కెట్ నుంచి చేజారిపోయింది.

ఇది కంపెనీ ఆదాయాలు, వృద్ధి, ఇతర అంచనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ముందు టీసీఎస్ సైతం కొన్ని భారీ డీల్స్ ముందుగానే క్లోజ్ చేసుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.గ్లోబల్ సంస్థ ఇన్ఫోసిస్‌తో చేసుకున్న ఎంవోయూను రద్దు చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నట్లు, పార్టీలు మాస్టర్ ఒప్పందానికి కట్టుబడి ఉండవని ఇన్ఫోసిస్ తరపున స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది.
ఇలా పెద్ద డీల్స్ చేజారిపోవటం ఉపాధి అవకాశాలను తగ్గిస్తుందని కొందరు టెక్కీలు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తగిన స్థాయిలో ప్రాజెక్టులు లేక చాలా మంది టాప్ టెక్ కంపెనీల నుంచి చిన్నపాటి కంపెనీల్లో సైతం బెంచ్ పై కొనసాగుతున్న వార్తలు వింటూనే ఉన్నాం. ఈ లెక్కన కొత్త ఏడాది పరిస్థితులు కొంత ఆందోళనకరంగానే ఉంటాయని ఐటీ రంగంలోని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications