Infosys News: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం.. నిరాశలో టెక్కీలు.. టీసీఎస్ కంటే..
Infosys News: ప్రస్తుతం ఇన్ఫోసిస్ వార్తల్లో నానుతోంది. ఇటీవల ఫౌండర్ నారాయణ మూర్తి యువత వారంలో కనీసం 70 గంటలు పనిచేయాలంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారానికి కారణం అయ్యాయి.
ఈ క్రమంలో దేశంలోని అగ్ర ఐటీ సేవల కంపెనీగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కంపెనీలు తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్‌ను రద్దు చేయటం చాలా మంది టెక్కీలను నిరాశకు గురిచేస్తోంది. ఎంట్రీ నుంచి మిడిల్ లెవెల్ ఉద్యోగులు నెలలో 10 రోజుల పాటు తప్పకుండా ఆఫీసుల నుంచి పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తీసుకొచ్చే క్రమంలో కంపెనీ హైబ్రిడ్ విధానంలోకి ప్రవేశించిందని తెలుస్తోంది.

ఇన్ఫోసిస్‌లోని వైస్ ప్రెసిడెంట్‌లలో ఒకరు ఎంపిక చేసిన వర్టికల్స్‌లోని ఉద్యోగులను, ప్రత్యేకంగా బ్యాండ్ 5, 6 (మిడ్-లెవల్ మేనేజర్‌లు, ప్రాజెక్ట్ హెడ్‌లు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు)లోని ఉద్యోగులను నెలకు కనీసం 10 రోజులు ఆఫీసుల నుంచి పనిచేయాలని కోరారు. నవంబర్ 20, 2023 నుంచి ఈ విధానాన్ని కంపెనీ అమలు చేయాలని చూస్తోంది. "In Person Collab" కింద ఉద్యోగులు ఇన్ఫోసిస్ కార్యాలయాల నుంచి పనిచేయాలని కంపెనీ భావిస్తోంది.
ప్రస్తుతం ఐటీ సేవల రంగంలో వ్యాపారం చేస్తున్న కంపెనీలను తాజాగా ఇన్ఫోసిస్ ఫాలో అవుతోంది. దిగ్గజ కంపెనీలైన Wipro, Capgemini, LTIMindtree, TCS వంటి కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను క్రమ పద్ధతిలో కార్యాలయానికి తిరిగి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాయి. అతిపెద్ద టెక్ కంపెనీగా ఉన్న టీసీఎస్ ఏకంగా వారంలో 5 రోజుల పాటు ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే రెండవ అతిపెద్ద టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ ఇదే బాటను ఎంచుకుంది. కరోనా తర్వాత ఉద్యోగుల్లో టీమ్ వర్క్ పెంచేందుకు భౌతికంగా బృందాలు ఆఫీసుల నుంచి కలిసి పనిచేసేలా ప్రోత్సహించేందుకు కంపెనీ కృషి చేస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన మెయిల్ లో వెల్లడించింది.


Click it and Unblock the Notifications