Infosys News: ఇండియన్ ఐటీ సేవల కంపెనీల్లో ఇప్పుడు జీతాల కోత కొనసాగుతోంది. వ్యాపార ఆదాయాల్లో వచ్చిన మార్పులు, తగ్గుతున్న లాభాలతో టెక్ కంపెనీలు ఖర్చుల కోతలను ప్రారంభించాయి.
దేశంలో టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ వార్షిక వేతనాన్ని 21 శాతం మేర తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తక్కువ జీతాన్ని పొందినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ నుంచి రూ.56.44 కోట్లను పరిహారంగా కంపెనీ నుంచి అందుకున్నారు. అయితే దీనికి ముందు ఏడాది ఆయన మెుత్తం పరిహారం రూ.71 కోట్లుగా ఉంది.

ఇదే క్రమంలో ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు చెల్లించాల్సిన వేరియబుల్ వేతనాన్ని సైతం తగ్గించింది. మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల సగటు వేరియబుల్ వేతనాన్ని 40 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. అంటే ఇన్ఫోసిస్ ఉద్యోగులు సగటున కంపెనీ ఇచ్చిన వాగ్దానంలో 60 శాతం వేరియబుల్ వేతనాన్ని మాత్రమే పొందారు.
ఇదే సమయంలో FY23లో ఇన్ఫోసిస్ CFO నిలంజన్ రాయ్ అందుకుంటున్న పరిహారం 28% పెరిగి రూ.10.61 కోట్లకు చేరుకున్నట్లు ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక వెల్లడించింది. అలాగే ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని ఏడాదికి వేతనాలు తీసుకోలేదు. దీనికి ముందు గతవారం ఐటీ సేవల కంపెనీ హెచ్సీఎల్ టెక్ తన ఉద్యోగులకు అందించే వేతనాల విషయంలో హెచ్ ఆర్ పాలసీలను మార్చింది. దీని కారణంగా ఉద్యోగులు అందుకునే వేతనం తగ్గుతుందని వెల్లడైంది.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications