Infosys CEO: మనందరికీ భాగా తెలిసిన డైలాగ్ ఒకటి ఉంది అదే 'డబ్బులు ఎవరికీ ఊరకే రావు'. సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో చాలా కంపెనీలు తమ రథసారదుల జీతాలకు సైతం కోతలు విధిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పారిఖ్ భారీ వేతనాన్ని అందుకుంటున్నారు.

ఐటీ దిగ్గజం..
మాంద్యం భయాలు పెరుగుతున్నప్పటికీ భారత ఐటీ కంపెనీలు మాత్రం ప్రాజెక్టులను పొందుతూ లక్షల మందికి ఉపాధి అవకాశాలను పోకుండా నిలబెడుతున్నాయి. దేశంలోని ఐటీ సేవల రంగంలోని ఇన్ఫోసిస్ మంచి పనితీరుతో రెండవ స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు కంపెనీని విడిచిపెట్టిన కొద్ది సంవత్సరాల్లోనే విశాల్ సిక్కా సీఈవోగా బాధ్యతలు చేపట్టడంతో ఇన్ఫోసిస్ టాప్ మేనేజ్‌మెంట్ కొంత కాలంగా సందిగ్ధంలో పడింది.

సలీల్ పారిఖ్..
సందిగ్ధ సమయంలో ఇన్ఫోసిస్ యాజమాన్యం ఎంతో నమ్మకంతో సలీల్ పారిఖ్‌ను సీఈవోగా నియమించింది. సలీల్ రాకతో కంపెనీ అభివృద్ధి వేగం పుంజుకోవటంతో పాటు వ్యాపారం, ఆదాయాలు సైతం మెరుగుపడ్డాయి. ఇవి ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకుల్లో నమ్మకాన్ని నింపింది. దీనికి తగ్గట్టుగానే సీఈవోకు చెల్లించే జీతాన్ని సైతం కంపెనీ పెంచింది.

ఇండస్ట్రీలో 30 ఏళ్లు..
ఐటీ పరిశ్రమలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పారిఖ్‌కు 30 ఏళ్ల అనుభవం ఉంది. మార్కెట్లలో అతని విస్తృతమైన వ్యాపార అనుభవం కంపెనీని వృద్ధి బాటలో నిర్వహించేందుకు దోహదపడింది. గతంలో ఆయనకు కంపెనీ రూ.42.50 కోట్లను వార్షిక ప్యాకేజీగా చెల్లించింది. అయితే 2022లో ఆయన వేతనాన్ని 88 శాతం మేర పెంచి రూ.79.75 కోట్లుగా చేసింది. ఇందులో ఇన్ఫోసిస్ మేనేజ్‌మెంట్ అందించే షేర్ల విలువ కూడా కలిపి ఉంటుంది.

రోజుకు రూ.22 లక్షలు..
సీఈవోకు అందిస్తున్న మెుత్తం రూ.79.75 కోట్ల వార్షిక ప్యాకేజీలో రూ.11 కోట్లు స్థిర వేతనంగా ఉంటుంది. మిగిలిన మెుత్తం పనితీరు ఆధారంగా అందించే మిగిలిన వేతనాన్ని ప్రోత్సాహకంగా చెల్లిస్తోంది. అంటే సగటున ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పారిఖ్ రోజుకు రూ.22 లక్షల వరకు అందుకుంటున్నారు. దేశీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీల సీఈవోలతో పోల్చితే సలీల్ పారిఖ్ జీతం చాలా ఎక్కువగా ఉంది. దీంతో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సీఈవోల జాబితాలో సలీల్ పారిఖ్ చోటు దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications