Infosys News: పండగ చేస్కుంటున్న టెక్కీలు.. అంచనాలకు మించిన ఇన్ఫోసిస్ లాభాలు..
Infosys Q3 Earnings: వరుసగా టెక్ కంపెనీలు తమ మూడవ త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలను ప్రకటిస్తున్నాయి. టీసీఎస్ గత వారంలో తన ఫలితాల ప్రకటనతో టెక్ కంపెనీలపై మార్కెట్లో బెట్టింగులు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి.
ఈ క్రమంలోనే నేడు టాప్-2వ ఐటీ సేవల కంపెనీ అయిన ఇన్ఫోసిస్ తన డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన కంపెనీ నికర లాభం క్యూ3లో 11.4 శాతం పెరిగి రూ.6,806గా నమోదైంది. ఇది అంతకు ముందు ఏడాది రూ.6,106 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం మూడవ త్రైమాసిక కాలంలో 7.6 శాతం వార్షిక వృద్ధితో 41,764 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే ప్రస్తుతం వెలువడ్డ ఫలితాలు మార్కెట్ అంచనాలకు మించి ఉన్నాయి. ఈబీఐటీ మార్జిన 80 బేసిస్ పాయింట్లు పెరిగి 21.3 శాతంగా నమోదైంది.

తాజా ఫలితాలతో 2025 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తన వృద్ధి రేటు అంచనాలను 4.5 శాతం నుంచి 5 శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది. వాస్తవానికి సీజన్గా తక్కువ ఆదాయాలు ఉండే త్రైమాసికంలో బలమైన రాబడులను చూడటంపై కంపెనీ సీఈవో ఆశాభావంగా ఉన్నారు. ప్రస్తుత ఫలితాలు కంపెనీ ఆఫర్ చేస్తున్న భిన్నమైన డిజిటల్ ఆఫర్లు, మార్కెట్ పొజిషనింగ్, కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలకు స్పష్టంగా ప్రతిబింబిస్తోందనన్నారు. ఇదే క్రమంలో ఏఐ సామర్థ్యాల బలోపేతం, జనరేటివ్ ఏఐపై దృష్టి క్లయింట్ల పెరుగుదలకు దారితీసిందని సలీల్ పరేఖ్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పనితీరుతో రానున్న త్రైమాసికంలో మంచి ఆదాయాలను ఇన్ఫోసిస్ నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే పెద్ద డీల్స్ విషయానికి వస్తే డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 2.5 బిలియన్ డాలర్లతో 57 శాతం వృద్ధిని ఈ విభాగం నమోదు చేసిందని వెల్లడించింది. వాస్తవానికి ఇవి కంపెనీకి దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయ మార్గాలుగా నిలుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కంపెనీ ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్, హైటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో మంచి వృద్ధిని చూస్తోంది. అలాగే యూరప్, ఉత్తర అమెరికాల నుంచి మంచి వృద్ధిని చూసింది. అలాగే ప్రస్తుతం కంపెనీలో మెుత్తంగా 3,23,379గా ఉంది. అలాగే అట్రిషన్ రేటు 13.7 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లపై పెద్దగా ప్రభావం కనిపించకపోయినప్పటికీ రేపు స్టాక్ ప్రభావితం కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications