Infosys News: ఇండియన్ టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ గ్లోబల్ పరిస్థితులతో తనకేమీ సంబంధం లేదన్నట్లు కొత్త డీల్స్ కుదుర్చుకుంటూ ముందుకు సాగుతోంది.
ఆదాయాల మందగమనం నడుస్తున్న వేళ ఇన్ఫోసిస్ 454 మిలియన్ డాలర్ల విలువైన మెగా డీల్ కుదుర్చుకుంది. డెన్మార్క్ దేశానికి చెందిన డాన్స్‌కే బ్యాంక్ డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ కోసం ఈ డీల్ కుదుర్చుకోబడింది. ఇది 5 ఏళ్ల పాటు కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. భవిష్యత్తులో ఈ డీల్ 900 మిలియన్ డాలర్లకు పెంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే గడువు ముగిసిన తర్వాత మరో మూడేళ్ల కాలానికి డీల్ పొడిగించుకునే సౌలభ్యం ఉన్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్స్ లో వెల్లడించింది.

గ్రేటర్ డిజిటల్, క్లౌడ్ అండ్ డేటా సామర్థ్యాలతో తమ కోర్ వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ డాన్స్‌కే బ్యాంక్‌తో సహకరిస్తుందని సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. యూకే NEST నుంచి ఐటీ దిగ్గజం టీసీఎస్ 1.1 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని సొంతం చేసుకున్న వారం రోజుల తర్వాత ఇన్ఫోసిస్ తాజా డీల్ వివరాలను వెల్లడించింది. పైగా డాన్స్‌కే డీల్‌ను గెలవడానికి ఇన్ఫోసిస్ యాక్సెంచర్‌పై విజయం సాధించింది. ఇందులో భాగంగా బెంగళూరులోని డాన్స్‌కే బ్యాంక్ IT కేంద్రాన్ని కూడా కొనుగోలు చేస్తుంది. ఇందులో దాదాపు 1400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఇన్ఫోసిస్‌తో సహకారం కస్టమర్ అనుభవం, ఆపరేషనల్ ఎక్సలెన్స్ పెంచుకునేందుకు సహాయపడుతుందని డాన్స్‌కే బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సాంకేతిక పరివర్తనకు సహాయం చేయడానికి, సామర్థ్యాలను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపింది. ఇన్ఫోసిస్ టోపాజ్ పేరుతో కంపెనీ ఇటీవల ప్రకటించిన ఏఐ ఫస్ట్ ఆఫర్ డాన్స్‌కే బ్యాంక్ కార్యకలాపాలను, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలుస్తోంది. డిజిటల్ యుగంలో అగ్రగామి బ్యాంక్‌గా ఎదగాలన్న బ్యాంక్ వ్యూహానికి డిజిటలైజేషన్, టెక్నాలజీలో పెట్టుబడులు మద్దతునిచ్చాయని డాన్స్‌కే బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఫ్రాన్స్ వోల్డర్స్ తెలిపారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications