Infosys News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఇన్ఫోసిస్.. Q1 వేరియబుల్ పే ఎంతంటే..??
Variable Pay: ప్రతి త్రైమాసికంలోనూ ఐటీ సేవల కంపెనీలు తమ ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని చెల్లిస్తుంటాయి. అయితే అది ఎంత శాతం చెల్లిస్తారనే విషయాన్ని ఎప్పటికప్పుడు లాభాలు, పనితీరుకు అనుగుణంగా నిర్ణయిస్తుంటాయి.
ఈ క్రమంలో మెుదటి త్రైమాసికానికి భారతీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 80 శాతం వేరియబుల్ పే చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. అర్హులైన ఉద్యోగులందరికీ ఈ మెుత్తాన్ని చెల్లించనున్నట్లు పేర్కొంది. సవాలు, అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణం, ఐటీ కంపెనీలకు మందగించిన డిమాండ్ వాతావరణం మధ్య కంపెనీ ప్రకటన వచ్చింది. కంపెనీ ప్రస్తుతం ఆదాయ వృద్ధిపై అధిక దృష్టి సారించింది.

కంపెనీ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. మెుదటి త్రైమాసికంలో కంపెనీ మంచి పనితీరును కనబరిచిందని.. భవిష్యత్తు విస్తరణకు బలమైన పునాదిని ఏర్పరుస్తున్నట్లు అందులో తెలిపింది. వ్యాపారాల డిజిటల్ ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో క్లయింట్ అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. టీమ్స్ మధ్య సహకారాన్ని పెంచటం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు మెయిల్ ద్వారా తెలిసింది.
వేరియబుల్ వేతనం వ్యక్తుల పనితీరు, త్రైమాసికంలో సహకారంపై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది చివరి త్రైమాసికంలో ఉద్యోగులకు కంపెనీ కేవలం 60 శాతాన్ని వేరియబుల్ పే రూపంలో చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విప్రో తన ఉద్యోగులకు త్రైమాసికం జీతాల పెంపును వాయిదా వేసింది. హెచ్‌సీఎల్‌టెక్ జూనియర్ ఉద్యోగులకు మూడు నెలలు వాయిదా వేయగా.. సీనియర్ ఉద్యోగులకు ఈ ఏడాది హైక్స్ స్కిప్ చేసింది.


Click it and Unblock the Notifications