HCLTech News: భారత ఐటీ రంగంలో మార్పులు మెరుపు వేగంతో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఇన్నాళ్లుగా అనేక ఫ్లెక్సిబిలిటీలను అందుకున్న టెక్కీలకు కష్టకాలం మెుదలైంది. గతంలో కఠినమైన రూల్స్ పెట్టే సంస్థగా టీసీఎస్ పేరొందినప్పటికీ.. తాజా చర్యలతో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సైతం తానేమీ తక్కువ కాదని చెప్పకనే చెబుతోంది. దీంతో టెక్కీలు ఆందోళనలో ఉన్నారు.
దేశంలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ హెచ్‌సిఎల్‌టెక్ కొత్త పాలసీని విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగుల సెలవులను ఆఫీసులో వారి హాజరుతో అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. దీనిపై తమకు సమాచారం ఉందంటూ మనీకంట్రోల్ తన కథనంలో పేర్కొంది. కరోనా తర్వాత దాదాపుగా దేశంలోని అన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి క్యాంపస్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైబ్రిడ్ విధానాన్ని అమలులోకి తెచ్చి మూడు రోజులు వారంలో తప్పక ఆఫీసుల నుంచి పనిచేయాలని సూచించాయి. ఆ తర్వాత టీసీఎస్ వంటి సంస్థలు వారంలో 5 రోజులు తప్పక ఆఫీసులకు రావాల్సిందేనని ఉద్యోగులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో HCLTech తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు, నెలలో 12 రోజులు ఆఫీసులకు రావాలని సూచించింది. అయితే ఇకపై దీనిని పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడైంది. దీని ప్రకారం ఉద్యోగి కార్యాలయానికి హాజరుకాని ప్రతి రోజు వారి సెలవులను కత్తిరించబడతాయని విస్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ అభివృద్ధి సంస్థ హైబ్రిడ్ వర్క్ మోడల్‌కి మారిన ఐదు నెలల తర్వాత వస్తోంది. కంపెనీ తీసుకున్న పాలసీ ప్రకారం ఉద్యోగి హాజరును వారి సెలవులకు అనుసంధానించినట్లు హెచ్ ఆర్ ఈవారం నుంచి మెయిల్ ద్వారా బృందాలకు తెలియచేస్తున్నట్లు వెల్లడైంది.
ఇక్కడ విషయం ఏమిటంటే ఉద్యోగి ఆఫీసులకు రాకుండా పనిచేసినప్పటికీ వారు సెలవులో ఉన్నట్లుగా పరిగణించబడుతున్నందున చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ లీవ్ బ్యాలెన్స్ పూర్తయితే అవి వేతనంలో కోతలకు దారితీస్తాయని వారు చెబుతున్నారు. మూడేళ్లలోపు కంపెనీలో పనిచేస్తున్న HCLTech ఉద్యోగులు 18 వార్షిక సెలవులతో పాటు ఒక పర్సనల్ లీవ్ పొందేందుకు అర్హులు. అలాగే మూడేళ్లు పైన కాలం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు వార్షికంగా 20 సెలవులు, రెండు పర్సనల్ లీవ్స్ ఉంటాయి. అయితే కంపెనీ మాత్రం తమ హైబ్రిడ్ వర్క్ పాలసీ సౌలభ్యాన్ని అందిస్తుందని బదులిచ్చింది.
టీసీఎస్ రూల్స్:
ఐటీ ఇండస్ట్రీ ట్రెండ్స్ గమనిస్తే టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రావాల్సిందిగా ఇప్పటికే వెల్లడించింది. అయితే దీనిని ఉద్యోగుల వేరియబుల్ వేతనానికి లింక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీసీఎస్ తన ఉద్యోగులకు కనీసం 85 శాతం హాజరును ఆశిస్తోంది. కార్యాలయ హాజరు 75-85 శాతం ఉన్నవారు వారి వేరియబుల్ పేలో 75 శాతం పొందుతారని వెల్లడించింది. అయితే 60-75 శాతం హాజరు ఉన్నవారు వారి వేరియబుల్ పేలో కేవలం 50 శాతం మాత్రమే పొందగలరని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications