HCL Tech: భారీగా పతనమైన హెచ్‌సీఎల్ స్టాక్.. ఐటీ స్టాక్ ఇన్వెస్టర్లకు షాక్.. అందుకే..
HCL Tech Shares: దేశంలోని టాప్-5 ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సీఎల్ టెక్ షేర్లలో భారీ పతనం కొనసాగింది. ఇంట్రాడేలో షేర్ల పతనం కొనసాగింది. చివరి మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ 5.80 శాతం నష్టంతో టాప్ లూజర్‌గా తన ప్రయాణాన్ని మార్కెట్లలో ముగించింది.
ఇంట్రాడేలో స్టాక్ కదలికలను గమనిస్తే.. ఉదయం రూ.1,415 వద్ద ప్రయాణాన్ని ప్రారంభించిన ఐటీ దిగ్గజం ఇంట్రాడేలో కనిష్ఠంగా రూ.1,381 మార్కుకు పడిపోయాయి. చివరికి కంపెనీ షేర్లు ఒక్కొక్కటి రూ.1,388.30 రేటు వద్ద స్థిరపడ్డాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత ఎర్లీ ట్రేడింగ్ సమయంలో టెక్ స్టాక్ 6 శాతం మేర క్షీణతను నమోదు చేసింది.

అసలు వాస్తవానికి టెక్ కంపెనీ షేర్లు నేడు భారీగా పతనం అవ్వటానికి అసలు కారణంగా కంపెనీ శనివారం ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాలని నిపుణులు చెబుతున్నారు. నాలుగో త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ తన నికర లాభం రూ.3,995 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఇది అంతకుముందు ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన లాభం కంటే కేవలం 0.35 శాతం అధికం. అంటే వాస్తవానికి కంపెనీ పనితీరులో పెద్దగా పురోగతి కనిపించలేదని కంపెనీ తాజా ఆర్థిక ఫలితాలు చెబుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కుంటుపడేలా చేస్తున్నాయి.
ఇదే క్రమంలో వ్యాపారం ద్వారా ఆదాయం మార్చి త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 5.3 శాతం పెరిగి రూ.28,499 కోట్లుగా నివేదించబడింది. ఈ క్రమంలో కంపెనీ బోర్డు సభ్యులు అర్హులైన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.18 వార్షిక డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకోసం రికార్డు తేదీని మే 7, 2024గా ప్రకటించటం జరిగింది.
ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ ప్రకటించిన డివిడెండ్ ఆదాయాన్ని పొందాలనుకుంటున్నట్లయితే రికార్డు తేదీ నాటికి కంపెనీ బుక్స్ ప్రకారం తమ డీమ్యాట్ ఖాతాల్లో హెచ్‌సీఎల్ టెక్ షేర్లను కలిగి ఉండాల్సి ఉంటుంది. మెుత్తానికి కంపెనీ ఆర్థిక ఫలితాలు మార్కెట్లను పూర్తిగా నిరాశకు గురిచేయటంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్లలో విపరీతమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇదే క్రమంలో వివిధ బ్రోకరేజ్ సంస్థలు సైతం కంపెనీ టార్గెట్ ధరను రూ.1,300 నుంచి రూ.1,700 మధ్య ఉంచాయి.


Click it and Unblock the Notifications