Cognizant: పారిపోతున్న కీలక ఉద్యోగులు.. తలకిందులైన కాగ్నిజెంట్ ఫలితాలు.. ఎందుకిలా..?
IT News: చెన్నైలో ప్రారంభమై అమెరికా కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ తాజాగా జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీలో మెుత్తం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
జూన్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 463 మిలియన్ డాలర్లుగా నిలిచింది. గత ఏడాది ఇదే కాలంతో నికర లాభం 577 మిలియన్ డాలర్లతో పోల్చితే ఈసారి 20 శాతం మేర క్షీణించింది. ఇదే సమయంలో ఏడాది ప్రాతిపదికన ఆదాయం 0.4 శాతం మేర క్షీణించి 4.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

గడచిన త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక సేవలు, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ రంగాల నుంచి రాబడుల్లో క్షీణతను చూసింది. అయితే హెల్త్ కేర్, ప్రొడక్ట్స్ అండ్ రిసోర్సెస్ రంగాల నుంచి ఆదాయం మాత్రం వృద్ధిని నమోదు చేసింది. జూన్ త్రైమాసికం ముగిసే నాటికి మెుత్తం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,45,600గా ఉంది. ఇది అంతకు ముందు త్రైమాసికం కంటే 5,900 తక్కువ. ఇదే సమయంలో అట్రిషన్ రేటు 19.9 శాతానికి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ కంపెనీ మెరుగైన పనితీరును కనబరిచిందని సీఈవో రవికుమార్ వెల్లడించారు.

2022 చివరిలో ఇన్ఫోసిస్ నుంచి కాగ్నిజెంట్ కు మారిన రివికుమార్ కొద్ది రోజుల్లోనే సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ మార్పు నచ్చని చాలా మంది కంపెనీ నుంచి వెళ్లిపోయారు. గ్లోబల్ గ్రోత్ మార్కెట్స్ హెడ్ రాబ్ వాకర్, మాజీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్, స్ట్రాటజీ అండ్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా అనిల్ చెరియన్, చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా ఉన్న బెకీ ష్మిత్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లారెన్స్ వైజర్, గ్లోబల్ డెలివరీ హెడ్ ఆండీ స్టాఫోర్డ్ వంటి కీలక వ్యక్తులు కంపెనీని వీడారు. ప్రస్తుతం కంపెనీలో కొత్త సీఈవో తీసుకొస్తున్న మార్పులు చాలా మందిని నిష్కమించేలా ప్రేరేపిస్తున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications