Accenture News: భారత టెక్కీలకు యాక్సెంచర్ షాక్.. మరీ ఇంత దారుణమా..!!
Accenture News: టెక్ కంపెనీలు ఉద్యోగుల ఆశలను అడియాశలుగా చేస్తున్నాయి. ఈ క్వార్టర్ అయినా తమకు మంచి రోజులు వస్తాయని భావించిన టెక్కీల ఆశలు సమాదవుతున్నాయి.
ఈ క్రమంలోనే టెక్ దిగ్గజం యాక్సెంచర్ 2023లో భారతదేశం, శ్రీలంకలోని టెక్కీలకు వేతన పెంపులను నిలిపివేసింది. దీనికి తోడు వారికి ఇచ్చే బోనస్, ప్రమోషన్లను సైతం నిలిపివేసింది. చట్టబద్ధంగా తప్పనిసరి చేసిన చోట లేదా క్లిష్టమైన నైపుణ్యం ఉన్న ప్రాంతాల్లో దానికి కట్టుబడి ఉన్న చోట తప్ప మిగిలిన చోట్ల పెంపులు ఉండవని కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ వెల్లడించింది. ప్రస్తుతం యాక్సెంచర్ కంపెనీకి భారతదేశంలో 3 లక్షల మంది టెక్ ఉద్యోగులు ఉన్నారు.

ఈ రంగంలోని కంపెనీలు వ్యాపారంలో ఎదురుగాలిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 2023లో దాదాపు 19,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు యాక్సెంచర్ ప్రకటించింది. FY23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఊహించిన దానికంటే చాలా సవాలుగా ఉన్న స్థూల వాతావరణాన్ని కంపెనీ అనుభవించింది. కంపెనీ అంచనావేసిన దానికంటే కంపెనీ వృద్ధి రేటు తక్కువగా ఉన్నట్లు విజ్ వెల్లడించారు. FY24లో కంపెనీ 16 ఏళ్ల అత్యల్ప వృద్ధి దారిలో నడుస్తోంది.
కంపెనీ గ్లోబల్ వార్షిక బోనస్ ఫండింగ్ మా కంపెనీ పనితీరుపై ఆధారపడి ఉంటుందని అజయ్ విజ్ పేర్కొన్నారు. ప్రస్తుత పనితీరు కారణంగా ఇది గత ఏడాది కంటే తక్కువగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సంస్థ తన ప్రమోషన్లను కూడా తీవ్రంగా తగ్గిస్తుంది. లెవల్ 1 నుంచి 4 వరకు పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్‌లు జూన్ 2024 వరకు వాయిదా వేయబడ్డాయి. కంపెనీ తీసుకున్న సంచలన నిర్ణయాలు ప్రస్తుతం ఐటీ కంపెనీలు చూస్తున్న ప్రతికూల వ్యాపార పరిణామాలకు అద్ధం పడుతోంది. ఇప్పటికే దేశీయ టెక్ కంపెనీలు విప్రో, హెచ్సీఎల్ టెక్ తమ ఉద్యోగులకు వేతన పెంపులను దాటవేశాయి.


Click it and Unblock the Notifications