Accenture News: ఐటీ రంగంలో ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. ఈ సమయంలో కంపెనీలు చెప్పినట్లు చేయటం తప్ప టెక్ ఉద్యోగులకు మరో అవకాశం లేదు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన కంపెనీలు సైతం ప్రస్తుతం దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి.
ప్రఖ్యాత ఐటీ అండ్ కన్సలింటే దిగ్గజం యాక్సెంచర్ తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీసులకు తిరిగి రావాలని కోరుతోంది. ఆఫీసుల నుంచి పనిచేయాలని ప్రోత్సహిస్తోంది. దీనికి ముందు టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దేశీయ దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఈ విషయంలో డెడ్ లైన్స్ పెట్టిన సంగతి మనం గమనించాం. అదే దారిలో నడుస్తున్న యాక్సెంచర్ తన టీమ్ లీడర్స్, మేనేజర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఆగస్టు 31, 2023 నాటికి బేస్ లొకేషన్లలోని ఆఫీసుల నుంచి టీమ్స్ పనిచేసేలా చూడాలని వెల్లడించింది. దీనిద్వారా టీమ్ సభ్యులతో మెరుగ్గా కనెక్ట్ అవ్వాలని సూచించింది. క్లిష్టమైన ప్రాజెక్ట్‌ల్లో పని చేస్తూ.. క్లయింట్‌ల అవసరాలను తీర్చడానికి కలిసి తమ వంతు కృషి చేయాలని టెక్కీలను కంపెనీ కోరింది. దీనికి ముందు జనవరిలో టీసీఎస్ హైబ్రిడ్ ప్రక్రియలో వారంలో తప్పనిసరిగా మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తెలిపింది. పైగా దీనిని పనితీరు లెక్కింపులో పరిగణలోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది.
అలాగే FY24 చివరి నాటికి 70 శాతం ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయాలని దేశీయ ఐటీ మేజర్ హెచ్‌సీఎల్‌టెక్ ఆశిస్తోంది. కార్యాలయంలో పని చేసే విధానం 'అవసరాల ఆధారంగా' ఆధారపడి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అనేక ప్రాజెక్టుల ఉద్యోగులు కనీసం వారానికి కొంత సమయం వరకు కార్యాలయాల నుంచి పని చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే తాము హైబ్రిడ్ -ఫస్ట్ వర్చువల్ ఆపరేటింగ్ మోడల్‌ని కలిగి ఉన్నట్లు సీఈవో సి విజయకుమార్ వెల్లడించారు. ఇదే బాటలో ఇన్ఫోసిస్, ఐబీఎమ్ వంటి టెక్ కంపెనీలు ముందుకు సాగుతున్నాయి.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications