Infosys: దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ భారీ రిక్రూట్ మెంట్ ను ప్రకటించింది. ఇది నిజంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న టెక్కీలకు సదవకాశం అని చెప్పుకోవాలి. నియామకాల కోసం ఐటీ దిగ్గజం డైరెక్ట రిక్రూట్ మెంట్ విధానాన్ని ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు.

ఇంటర్వ్యూ వివరాలు..
ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ 5 రోజుల పాటు జరుగుతోంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే టెక్ నగరం బెంగళూరులో ఇవి నిర్వహించబడుతున్నాయి. ఈ నెల 12, 16, 19, 23, 26 తారీఖుల్లో బెంగళూరు ఆఫీసులో ఇంటర్వ్యూలు జరుగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఇంటర్వ్యూ సెప్టెంబర్ నెలలో ప్రతి శుక్ర, ఆదివారాల్లో జరుగుతుందని టెక్ సంస్థ హెచ్ ఆర్ విభాగం తెలిపింది.

ఇంటర్వ్యూ అర్హతలు..
అనుభవం కలిగిన అభ్యర్థులతో పాటు ఫ్రెషర్స్ కి కూడా కంపెనీ ఈ ఇంటర్వ్యూకు అనుమతిస్తోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే ఔత్సాహిక అభ్యర్థులు.. BCA, Btech, MBA, BE, BSC, SC విద్యార్హతగా ఉండాలి. బెంగళూరులోని కోనప్పన అగ్రహార, బేగూరు హోబ్లీ, ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఇన్ఫోసిస్ BPM లిమిటెడ్ కార్యాలయానికి అభ్యర్థులు చేరుకోవలసి ఉంటుంది. కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ.. అభ్యర్థులు తమ కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

గుర్తింపు పత్రాలు..
ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే అభ్యర్థిత తనతో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పక తీసుకెళ్లాలి. ఈ ప్రక్రియలో ఎంపికైన వారు ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుందని, Work From Home అవకాశం ఉండదని కంపెనీ తెలిపింది. రానున్న కాలంలో అన్ని కంపెనీలు ఇదే పద్ధతిని పాటించనున్నాయి. మూన్ లైటింగ్ వివాదం వల్ల ఇప్పటికే ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రమ్మంటున్న విషయం మనందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications