IT News: రోజులు, నెలలు గడుస్తున్న కొద్ది ఐటీ సేవల కంపెనీల్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. ప్రపంచ వ్యాపార మందగమనంతో పాటు ఖర్చులను తగ్గించుకుంటున్న నేపథ్యంలో టెక్కీలకు కొత్త కష్టాలు తప్పటం లేదని చెప్పుకోవాలి.
దీంతో కొన్ని నెలలుగా టెక్ కంపెనీలు దేశంలో దాదాపు పూర్తిగా తమ నియామకాలను నిలిపివేశాయి. దీంతో గడచిన 12 నెలలుగా ఐటీ నియమాకాలు క్షీణించి 14 శాతానికి చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. 2022 క్యూ1లో అత్యధికంగా 40 శాతం నుంచి నియామకాలు తగ్గిపోయినట్లు అమెరికా ఐటీ అనలిస్ట్ సంస్థ ISG ప్రకటించింది. నియామకాల్లో ఆలస్యం కొనసాగుతుండగా మరోపక్క అట్రిషన్ రేటు సైతం టెక్ కంపెనీల్లో స్థిరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

కరోనా మహమ్మారికి ముందర అనేక టెక్ సర్వీస్ కంపెనీలు భవిష్యత్ డిమాండ్‌ను ఊహించి ఎంట్రీ-లెవల్ సామర్థ్యాన్ని జోడించడానికి క్యాంపస్ ఆధారిత నియామకాలపై ఎక్కువగా ఆధారపడేవారు. అయితే కరోనా పాండమిక్ తర్వాత సీనియర్లను నియమించుకునేందుకు ఎక్కువగా సబ్ కాంట్రాక్టర్ ఛానెల్‌ని ఆశ్రయించాయి. ప్రత్యర్థి కంపెనీల కంటే ఎక్కువ పేస్కేల్ ఆఫర్ చేసిన సంగతి కూడా తెలిసిందే. 2022 మధ్యలో ఈ రెండు హైరింగ్ ఇంజన్‌లు కలిసి వచ్చినప్పుడు, పరిశ్రమలో ఎన్నడూ చూడని రీతిలో బూమ్ కనిపించింది. ఆ సమయంలో కంపెనీల్లో అట్రిషన్ రేటు సైతం అధిక స్థాయిలకు చేరుకుంది.
ఐటీ, వ్యాపార సేవల పరిశ్రమ ప్రస్తుత స్థితి మునుపటి "గ్రేట్ రీషఫిల్‌కి భిన్నంగా "గ్రేట్ స్టే"గా రూపొందించబడినదని హెచ్‌ఆర్ సంస్థ, టీమ్‌లీజ్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ అన్నారు. గత రెండు సంవత్సరాల్లో కూలింగ్ లేబర్ మార్కెట్‌కు కొత్త నియామకాల తగ్గుదల గణనీయంగా దోహదపడిందని పేర్కొన్నారు. ప్రస్తుత వ్యాపార పరిస్థితులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో జాప్యానికి దారితీసిందని, కాబోయే గ్రాడ్యుయేట్లపై ఇది ఖచ్చితమైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications