IT News: టెక్ రంగాలో వస్తున్న వేగవంతమైన మార్పులు ఆ రంగంలోని ఉద్యోగులను అయోమయంలోకి నెడుతున్నాయి. ప్రస్తుతం ఐటీ సేవల రంగంలో ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కొనసాగుతున్నట్లు దిగ్గజ కంపెనీల డేటా చెబుతోంది.
అవును ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇకపై మరోలెక్క అన్నట్లు ఉంది టెక్కీల ఉద్యోగ కష్టాలు. కరోనా సమయంలో కంపెనీలకు వారు చెప్పిందే వేదం. చేసేది లేక కంపెనీలు సైతం అప్పట్లో కొంత తలవంచాయి. కానీ ఏఐ రంగంలోకి దిగటం, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార అనిశ్చితితో చాలా మంది ఫ్యూచర్ పై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.

దేశంలోని టాప్ టెక్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ గతవారంలోనే తమ జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాయి. వీటిలో కంపెనీ వెల్లడించిన వివరాలను గమనిస్తే.. ఉద్యోగుల్లో ఆసక్తికరమైన మార్పు కనిపించింది. అదేంటంటే అట్రిషన్ రేటు తగ్గటం. ఈ అట్రిషన్ రేటు కంపెనీ నుంచి మానేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సూచిస్తుంది. ఈ త్రైమాసికంలో అది అన్ని ఐటీ కంపెనీల్లోనూ గతంలో కంటే తగ్గుతూ వచ్చింది. దీనికి టెక్ కంపెనీలు నియామకాలను తగ్గించటం ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మెుదటి త్రైమాసికంలో టీసీఎస్ అట్రిషన్ రేటు 17.8 శాతం ఉండగా.. ఇన్ఫోసిస్ లో 17.3 శాతంగా ఉంది. ఇక విప్రోలో అట్రిషన్ తక్కువగా 14 శాతం వద్ద ఉంది. అలాగే హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో అట్రిషన్ 16.3 శాతంగా నమోదైంది. ఈ రేటు మార్చితో ముగిసిన త్రైమాసికంలో దాదాపు 20 శాతానికిపైగానే ఉన్నట్లు కంపెనీలు నివేదించాయి. కొత్త రిక్రూట్మెంట్లు లేకపోవటంతో చాలా మంది ఉద్యోగం మారే విషయంపై జాగ్రత్తగా ముందకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలా కంపెనీలు కొత్త నియామకాల కంటే ఉన్న ఉద్యోగులను అప్ స్కిల్ చేయటంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఇందుకోసం వారికి శిక్షణ ఇచ్చేందుకు భారీగా ఖర్చుచేస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications